మరో ఫోటో లీక్: నాగ చైతన్య-సమంత ఎఫైర్ నిజమే!
హైదరాబాద్: నాగ చైతన్య, సమంత మధ్య ప్రేమాయణం నడుస్తోందని, ఇద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారన్నది బహిరంగ రహస్యమే. అయితే అటు నాగ చైతన్యగానీ, ఇటు సమంత కానీ తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని మీడియాతో పంచుకోవడానికి ఇష్టపడటం లేదు.
అయితే మీడియాలో ఈ విషయమై ప్రచారం జరుగుతుంటే.... మౌనంగా వహించడం ద్వారా తమ అంగీకారాన్ని పరోక్షంగా తెలియజేసారు. నాగార్జున కూడా తనకు కాబోయే కోడలు సమంత అని నేరుగా చెప్పక పోయినా....చైతూ తన భాగస్వామిని తనే ఎంచుకోవడం సంతోషంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.
అయితే ఇలాంటి విషయాలు ఎంత ఆపినా ఆగవు... నాగ చైతన్య, సమంత కలిసి ఎక్కడికి వెళ్లినా ఆ ఫోటోలు ఇట్టే బయటకు లీక్ అవుతున్నాయి. తాజాగా సమంత, నాగ చైతన్య జివికె మాల్ వద్ద ఉన్న హార్డ్ రాక్ కేఫ్ రాత్రి పూట వచ్చిన ఫోటో ఒకటి బయటకు లీకైంది. సోషల్ మీడియాలో ఈ ఫోటోలు ఇపుడు హల్ చల్ చేస్తున్నాయి.

సమంత-నాగ చైతన్య
జివికె మాల్ వద్ద నాగ చైతన్య, సమంత. సమంత ముఖం సరిగా కనిపించడం లేదు.. కానీ ఆ డ్రెస్సులో ఉన్నది సమంతే అనడానికి పక్కన ఫోటోయే సాక్ష్యం.

ప్రేమలో..
ఏమాయ చేసేవే సినిమాలో కలిసి నటించడం ద్వారా సమంత, నాగ చైతన్య మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయమే తర్వాత ప్రేమగా మారింది.

బయట పెట్టిన సమంత..
తాను ప్రేమలో పడ్డానని, త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిలవుతానని ఇటీవల సమంత వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే నాగ చైతన్య పేరు మాత్రం బయట పెట్టలేదు.

డిసెంబర్లో
నాగార్జున కూడా వీరి వివాహంపై సంతోషంగానే ఉన్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











