For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  కార్‌వాన్‌లో పట్టుబడ్డ సూపర్ స్టార్.. హీరోయిన్‌తో షూటింగ్ స్పాట్‌లోనే..

  By Rajababu
  |

  ఓ సూపర్‌స్టార్ హోదా కలిగిన నటుడు తన సహచర నటితో వ్యానిటీ వ్యాన్‌లో శృంగారం జరుపుతూ పట్టుపడిన ఘటన దక్షిణాది చిత్ర పరిశ్రమలో సంచలనం రేపుతున్నది. సాధారణంగా కొంతమంది హీరోలు, భార్యలకు దూరమైన సీనియర్ నటులు తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కార్‌వాన్‌లో రొమాన్స్ చేస్తారనేది బహిరంగ రహస్యమే. కానీ ఈ సారి ఏకంగా ఓ సూపర్ స్టార్ ఈ వ్యవహారంలో చిక్కడం చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో దొరికిన హీరోయిన్‌ తన సహచర నటి కావడం ఈ ఘటనకు మరింత క్రేజ్‌ను పెంచింది. ఇంతకు రాసలీలల్లో మునిగిన తారలు ఎవరంటే...

  సూపర్ స్టార్ తీరుపై

  సూపర్ స్టార్ తీరుపై

  దక్షిణాది సినీ పరిశ్రమలో ఆ నటుడు సూపర్ స్టార్. ఇటీవల జాతీయ అవార్డు సాధించిన చిత్రంలో నటించాడు. ఆయన కెరీర్‌లో ఎన్నో హిట్లు ఉన్నాయి. దక్షిణాది చిత్ర పరిశ్రమలో చాలా మంది తారలతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాంటి వ్యక్తి ఈ రకంగా వ్యవహరించడం అనేక విమర్శలకు తావిచ్చింది. షూటింగ్‌ను వదిలేసి ఈ రకమైన వ్యవహారానికి ఒడిగట్టడంపై పలువురు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.

  చిలకా గోరింకలుగా..

  చిలకా గోరింకలుగా..

  తనతో గతంలో నటించిన హీరోయిన్ ప్రస్తుతం సన్నిహితంగా మెలుగుతుందని, వారు ఇటీవల షూటింగ్ స్పాట్‌లోనే చిలకా గోరింకల్లాగా వ్యవహరిస్తున్నారు అని చిత్ర యూనిట్ సంబంధించిన వ్యక్తులు వెల్లడించారు. షూటింగ్ మధ్యలో వారిద్దరూ కార్‌వాన్‌లోకి వెళ్లి తలుపులు బిగించుకొన్నారు. ఎంతకీ రాకపోవడంతో షూటింగ్ నిలిపివేసి సిబ్బంది వేచిచూడాల్సి వచ్చిందిట. ఈ వ్యవహారం ఎంతకు ఎడతెగకపోవడంతో నిర్మాత స్వయంగా వెళ్లి వారిని బయటకు పిలిపించినట్టు సమాచారం.

  షూటింగ్ స్పాట్‌లో..

  షూటింగ్ స్పాట్‌లో..

  ఎంతో మంది సేవలందిస్తున్న షూటింగ్ స్పాట్‌లో ఇలాంటి వ్యవహారాలను తగ్గించాలని వారిద్దరికి నిర్మాత సూచనలిచ్చాడట. మీడియా వారికి, సినీ వర్గాలకు తెలిస్తే ప్రొడక్షన్ పరువు పోతుందని సదరు నిర్మాత గోలపెట్టాడట. ఏదైనా వ్యవహారం ఉంటే షూటింగ్ అయిపోయిన తర్వాత బయట చూసుకోవాలని స్టార్ హీరోను కోరినట్టు తెలుస్తున్నది.

  హీరోయిన్ కూడా పాపులర్..

  హీరోయిన్ కూడా పాపులర్..

  ఆ సూపర్ స్టార్‌కు గతంలో చాలా మంది హీరోయిన్లతో అఫైర్లు ఉన్నట్టు వార్తలు వచ్చాయి. సూపర్ స్టార్ ప్రస్తుతం భార్యకు దూరంగా ఉంటున్నారు. సూపర్ స్టార్‌తో రొమాన్స్ సాగిస్తున్న హీరోయిన్ కూడా పాపులర్. ఎన్నో సంచలన విజయాలు ఆమె సొంతం చేసుకొన్నది. వారిద్దరి మధ్య కొనసాగుతున్న అఫైర్ గురించి తాజాగా పత్రికలు కథనాలను వెల్లడించాయి. వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించాయి.

  బాక్సాఫీస్ వద్ద సంచలనాలు

  బాక్సాఫీస్ వద్ద సంచలనాలు

  తాజాగా వారిద్దరూ జత కట్టిన చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ప్రస్తుతం అఫైర్‌లో జోరు మీద ఉన్న ఈ ప్రేమజంట బాక్సాఫీస్ వద్ద సంచలనాలు రిపీట్ చేస్తారా అనే వేచి చూడాల్సిందే. అయితే ఈ ప్రేమ జంట పేర్లను చెప్పడానికి ప్రొడక్షన్ సిబ్బంది నిరాకరించినట్టు సమాచారం. ఈ కథనాన్ని ఓ జాతీయ వెబ్ సైట్ ప్రముఖంగా ప్రచురించింది. ఇదంతా చదివిన తర్వాత కాస్తా సినీ విషయాలు తెలిస్తే ఆ తారలు ఎవరో గుర్తించడం చాలా సులభమట.

  English summary
  Actors caught making out with their alleged girlfriends in vanity vans is not new for sure. Right from singletons to married celebs to divorced actors, each of them have been caught in the act. But this time it involves a south superstar! This hot scoop is sure to make you sit right up. We hear this superstar who has worked in a National Award winning film was caught having a steamy moment with his girlfriend. What’s most interesting – she happens to be his co-star!
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X