జగన్ కే గురి: పవన్ కళ్యాణ్ తాజా ఇంటర్వూ -1 (ఫోటో ఫీచర్)

By Srikanya

హైదరాబాద్: జన సేన పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మరోసారి తన అభిప్రాయాలను ప్రజలకు తెలియచేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన స్పీచ్ విన్నవారిలో కలిగే అనేక సందేహాలకు ఆయన చాలా స్పష్టతతో సమాధాన మిచ్చారు.

జనసేన పార్టీ ఆవిర్భావం అనంతరం పవన్‌ కల్యాణ్‌ తొలి ఇంటర్వ్యూ ఇది. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు'తో ఆయన మాట్లాడుతూ అనేక విషయాలు తెలియచేసారు. వాటిలో ముఖ్యాంశాలను ఈ ఆర్టికల్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నాం.

ఈ ఇంటర్వూలో... ఆయన డైరక్ట్ గా జగన్ పై గురి పెట్టారు. అభియోగాలున్న జగన్‌ స్వచ్ఛమైన పాలన ఎలా ఇస్తారు?, ఇంతింత సొమ్ము ఇంత త్వరగా ఎలా సంపాదిస్తారో ఆశ్చర్యంగా ఉంది... ఎం పదవిపై ఆయనకెందుకింత తొందరో అర్థం కావట్లేదు
అంతా నాకే కావాలి... వెంటనే కావాలనే కాంక్ష జగన్‌ది... ఓ గదిలో పట్టేంత అభియోగపత్రాలన్నీ అబద్దాలైపోతాయా? అంటూ ప్రశ్నించారు.

అలాగే జగన్‌ దెబ్బకు సీనియర్‌ ఐఏఎస్‌లు ఏపీ క్యాడర్‌ని ఎంచుకునేందుకే భయపడుతున్నారని అన్నారు. నేనూ దోచుకోవచ్చనే భావజాలాన్ని అందరిలో తీసుకొచ్చిన ఘనుడు వైఎస్‌... తెలంగాణ వాదం బలపడటానికి ఆయనే కారణం..మావాడు తిననివ్వడు... వైఎస్‌ తిననిస్తాడని తెదేపా నేతలే అంటుంటే ఆశ్చర్యపోయా అన్నారు. తెలుగుదేశం గురించి ఆయన మాట్లాడారు.

స్లైడ్ షోలో ఆయన మాట్లాడిన విశేషాలు...

అదే నా పార్టీ ఆవిర్భావానికి ప్రేరణ?

అదే నా పార్టీ ఆవిర్భావానికి ప్రేరణ?

పవన్: జనసేన ఆవిర్భావానికి రాష్ట్రాన్ని విభజించిన తీరు ఒక చిన్న కారణం మాత్రమే. విభజన కంటే కూడా ప్రజల మధ్య విచ్ఛిన్న భావనలు నాటడం ఆందోళన కలిగించింది. దాని పర్యవసానాలు ఎటు దారి తీస్తాయో వీళ్లు గ్రహిస్తున్నారా? కోపం కరడుగట్టుకుపోతే ఏమవుతుందో నాకు తెలుసు. బింద్రన్‌వాలే లాంటివాళ్లు అలాగే పుట్టుకొచ్చారు. ఆ పరిణామం సమాజానికి మంచిది కాదు.

పార్టీ ఆవిర్భావం ఆలస్యమా

పార్టీ ఆవిర్భావం ఆలస్యమా

పవన్: కేవలం ఓట్లు, సీట్ల కోసం జనసేన ఆరంభించలేదు. జగన్‌ జైల్లో ఉన్నప్పుడే నన్ను సమైక్య ఉద్యమానికి సారథ్యం వహించమని కొంతమంది ఆహ్వానించారు. సారథ్యాన్ని, అధికారాన్ని అందిపుచ్చుకోవటం ఇప్పుడు సులభమనీ, జనాల్ని పట్టుకోవచ్చనీ చెప్పారు. ఇది చాలా తప్పుగా అనిపించింది. అవకాశవాద రాజకీయాలకు ఎన్నడూ నా మనసులో స్థానం లేదు.

పోటీలో లేకపోతే ఏమిటి ఉపయోగం?

పోటీలో లేకపోతే ఏమిటి ఉపయోగం?

పవన్: నేనే పూర్తిస్థాయి బలం లేదని బరిలోకి దిగలేదు. నిలబడితే ఇండిపెండెంట్ల రూపంలోనైనా కొన్ని గెలవగలను. కానీ ప్రజల సంక్షేమం దృష్ట్యా ఆగిపోయాను. ఓట్లను చీల్చటం ఇష్టం లేక ఆగిపోయాను. ఈ మొత్తం ప్రక్రియలో నాకు వీసమెత్తు లాభం లేదు. ఉన్నపళంగా అధికారం చేపట్టాలనే, అధికారంలో భాగం కావాలనే ఆశ లేదు. కేవలం ప్రజల సంక్షేమం కోసమే ఇలా చేస్తున్నా.

ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు?

ఎందుకు నిర్ణయం మార్చుకున్నారు?

పవన్: నేను వస్తే ఎంత కాదన్నా కులం, మతం, ప్రాంతం లెక్కల్లో ఓట్లలో చీలిక వస్తుంది. ఇక నా అభిమానులు, పార్టీ సిద్ధాంతాలు నచ్చినవాళ్లు వేస్తారు. మేం ఇంతకు ముందే కొంతమందిని గుర్తించాం. వివిధ ప్రాంతాల్లో అభ్యర్థుల్ని చూశాను. అభ్యుదయ భావాలతో సమాజ సేవలో ఉన్నవారిని చూశాం. వాళ్లను నిలబెట్టి కొన్ని సీట్లు గెలవొచ్చు. గెలవకపోవచ్చు. ఒకసారి సానుకూలంగా ఆలోచిద్దాం. అన్నీ కుదిరి రాబోయే ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక శక్తిగా ఎదిగితే ఎవరికీ మద్దతు ఇవ్వకుండా ఉండిపోయామంటే ఆ ప్రకియలో గందరగోళం సృష్టించినవాణ్నవుతాను.

ప్రజారాజ్యం అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొనే ?

ప్రజారాజ్యం అనుభవాల్ని దృష్టిలో ఉంచుకొనే ?

పవన్: ఈ నిర్ణయానికి ప్రజారాజ్యం అనుభవాలు కారణం అనేకంటే నా స్థాయిని నేను గుర్తించాలి కదా. నేను బాగా తిరిగిన ప్రాంతాల్లోనే పోటీ చేయాలనుకున్నాం. రెండుచోట్లా కలిపి అసెంబ్లీకి 90. లోక్‌సభకి 20చోట్ల నుంచి అభ్యర్థుల్ని నిలబెట్టాలనుకున్నాం. అందులో తెలంగాణలోని స్థానాలు ఎక్కువగా ఉన్నాయి.

 అన్నయ్యకే ఎదురు నిలిచా

అన్నయ్యకే ఎదురు నిలిచా

పవన్: నేను ప్రేమించిన అన్నయ్యకే ఎదురు నిలిచాను. ఇక వాళ్లు మాట తప్పితే ఎందుకు ఎదిరించను? తప్పకుండా ప్రశ్నిస్తాను.

పీఆర్పీ నుంచి నేర్చుకొన్న అనుభవం ఏమిటంటే...మంచి చేయాలనే ఉన్నతాశయాలు ఉన్నా... పార్టీని నడిపేందుకు అవి మాత్రమే సరిపోవు అని అర్థమైంది. వాస్తవిక దృక్పథంతో పని చేసే విధి విధానాలు చాలా బలంగా ఉండాలి. చాలామంది వాళ్ల భయాల్నీ, అనుభవాల్నీ పట్టుకొచ్చారు. వాళ్లెవరూ కొత్త తరం మనోభావాలకు అద్దంపట్టేవాళ్లు కారు.

పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం పై

పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం పై

పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేసేటప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయలేదు.. మీరు నాకు వదిలేయండి... నేను చూసుకొంటానని చెప్పినా ఎవరూ నమ్మేవారు కాదేమో? ఎందుకంటే నాకు రాజకీయ అనుభవం లేదు. ఎవరితోనైనా అంటే నీకు ఆవేశం అంటారు. నా ఆలోచనలేవీ అన్నయ్యకి చెప్పలేదు. ఓ వైపు వైఎస్సార్‌ పిలుపుతో చాలామంది వెళ్లిపోదామని సిద్ధమైపోయారు. ఒక్కడున్నా పార్టీని నడిపే స్థెర్యం అవసరం. వాళ్లను కూర్చోబెట్టి ఎన్ని సిద్ధాంతాలు, ఆశయాలు చెప్పినా పార్టీలో ఉండే పరిస్థితి లేదు. అన్నయ్య మీద బరువు పెట్టేసేవారు. దాంతో ఆయన కాంగ్రెస్‌లో కలిపేశారు. పార్టీ అన్నాక ఇబ్బందులు వస్తాయి... ఓడిపోతాం... నష్టాలు కష్టాలు వస్తాయి. వాటిని తట్టుకొని ఉంటే పీఆర్పీ నేడు ప్రత్యామ్నాయ శక్తి అయ్యేది.

కర్త కర్మ క్రియ

కర్త కర్మ క్రియ

జనసేన పార్టీకి కర్త కర్మ క్రియ... ప్రస్తుతానికి నేనే . త్వరలో సమష్టి నాయకత్వం ఉంటుంది. ప్రస్తుతానికి నాతోపాటు రాజు రవితేజ్‌ ఉన్నారు. నాతోపాటు ప్రయాణించే వాళ్ల కోసం చూస్తున్నాను. రోజూ వేలమందిని కలిసి కరచాలనం చేయటం. దణ్ణంపెట్టడమే పార్టీ, నాయకత్వానికి కొలమానం కాదు కదా.

విమర్శపై...

విమర్శపై...

ఏదైనా ఆవేశంలో మొదలుపెట్టి ఆపై ఆపేస్తారనే విమర్శ పై స్పందిస్తూ... అలా కనిపిస్తుంది అంతే. కామన్‌ మ్యాన్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ని మరింత చురుగ్గా ముందుకు తీసుకెళ్లే సమయంలోనే పీఆర్పీ వచ్చింది. అప్పటికే ఫోర్స్‌కి సంబంధించిన కార్యకలాపాల్ని అంతర్గతంగా ప్రారంభించాం. పీఆర్‌పీ కోసం నిలిపాం.

చిరంజీవినెందుకు నిందించటం లేదు?

చిరంజీవినెందుకు నిందించటం లేదు?

నేను ఎవరి గురించీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. విభజన చేసిన విధానంలో కాంగ్రెస్‌ అనుసరించిన విధానాన్నే తప్పుబట్టాను. అందులోని ముఖ్యుల గురించే మాట్లాడాను. మన ఎంపీలకీ, నాయకులకీ ఎప్పుడైనా నోరు విప్పే అవకాశం కాంగ్రెస్‌ ఇస్తే కదా.

ఉపయోగం లేదు

ఉపయోగం లేదు

చిరంజీవి తన పదవికి రాజీనామా చేసి గళం విప్పి ఉంటే ఉపయోగం ఏమీ ఉండేది కాదు. విభజన చేసిన తీరు చాలా అసహ్యంగా ఉంది. పరిస్థితులూ సున్నితంగా మారిపోయాయి. ఒక మాట ఎక్కువ మాట్లాడినా తప్పే... తక్కువ మాట్లాడినా ఇబ్బందే అన్నట్లయింది. అందరికీ అదే పరిస్థితి కల్పించారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం అనడంలోనూ సహేతుకత ఉంది. రాజకీయాలకు సంబంధం లేనివాళ్లూ అదే పరిస్థితుల్లోకి వెళ్లారు. ఎవరికి వాళ్లకి ఆస్తులు, వ్యాపారాలు ఉంటాయి కదా. వాటినీ చూసుకోవాలి. నాకు ఎలాంటి ఆస్తులూ లేవు. కాబట్టి ఏ ఇబ్బందీ లేదు.

షూటింగ్‌ రోజులు కుదించుకొంటా

షూటింగ్‌ రోజులు కుదించుకొంటా

సినిమాలు చేస్తాను. వేరే జీవితం ఏమీ లేదు. ఇప్పటిదాకా ఏడాదికి 100 రోజులపాటే షూటింగ్‌లో పాల్గొనే వాడిని. ఇప్పుడు పార్టీ నిర్మాణానికి తగిన సమయం కేటాయించాలి కాబట్టి ఆ షూటింగ్‌ రోజులు 50కి కుదించుకొంటాను.

నరేంద్ర మోడీ మతవాద ముద్ర పై

నరేంద్ర మోడీ మతవాద ముద్ర పై

'గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌కి గుజరాత్‌ వెళ్లినప్పుడు ఓ హోటల్‌లో బస చేశాను. దాని యజమాని ముస్లిం. ఆయనతో మాట్లాడిన సందర్భంలో 'గోద్రా అల్లర్లు కచ్చితంగా తప్పుబట్టాల్సినవే. వాటినే గుర్తు చేసుకొంటూ ఉండలేం కదా... చేసిన అభివృద్ధినీ చూడాలి కదా' అన్నారు. నా దృష్టిలో కాంగ్రెస్‌ కంటే మోడీయే నిజమైన లౌకికవాది.. బలమైన నాయకత్వ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వారి చుట్టే అంతా తిరుగుతుంది. నాయకత్వ లక్షణాల్లో ప్రధానమైనది నిర్ణయం తీసుకొనే శక్తి మోడీలో తప్ప మనకున్న నాయకుల్లో చాలామందిలో అది కనిపించట్లేదు.

అన్నయ్యలాగే పార్టీని విలీనం చేస్తారేమోనని...

అన్నయ్యలాగే పార్టీని విలీనం చేస్తారేమోనని...

పీఆర్పీ అనుభవం నేపథ్యంలో అన్నయ్యలాగే పార్టీని విలీనం చేస్తారేమో అనే సందేహం ఉండనివ్వండి. జీవితం ఆఖరు రోజున నన్నర్థం చేసుకుంటారు. ప్రయాణంలో ఒక్క అడుగు వేయగానే సందేహిస్తే తప్పులేదు. నేను మంచి వాణ్ణి, బలమైన సిద్ధాంతాలతో ఉన్నానని నిరూపించుకుంటాను. మాటలతో కాదు. చేతలతో! నడతతో నిరూపించుకుంటాను.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X