This Week Releases: మలయాళంలో 9 సినిమాలు.. మీ ఫేవరేట్ హీరో మూవీ ఉందా?
దేశీయ సినిమా రంగంలో ఎలాంటి అవరోధాలు లేకుండా మలయాళ చిత్రం సూపర్ హిట్స్‌తో దూసుకెళ్తున్నది. మోహన్ లాల్, మమ్ముట్టి, పృథ్వీరాజ్ సుకుమారన్ లాంటి పెద్ద హీరోల చిత్రాలే కాకుండా మార్కో, మరణమాస్ లాంటి సినిమాలు ఘన విజయాలు అందుకొన్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా దేశీయ సినిమా రంగానికి మలయాళ చిత్రాలు దిక్సూచిలా మారాయంటే ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ప్రతీ వారం మలయాళంలో ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయనే విషయంపై అని భాషల ప్రేక్షకులు దృష్టిపెట్టేలా చేసింది. ఈ క్రమంలో ఈ వారం భారీ సంఖ్యలో చిన్న, మీడియం సినిమాలు రిలీజ్ సిద్దమయ్యాయి. ఆ సినిమాల వివరాల్లోకి వెళితే..
ఈ ఏడాదిలో అత్యధికంగా సక్సెస్ అందుకొన్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే.. అది మలయాళం సినిమా పరిశ్రమనే మార్కో నుంచి మొదలుపెడితే.. ఎంపురాన్, అలెప్పీ జింఖానా, బజూకా, మరణమాస్ సినిమాలకు ప్రేక్షకలు ఆదరణ దక్కింది. ఇటీవల రిలీజైన తుడరం భారీ విజయం అందుకొన్నది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల రూపాయలు, మలయాళంలో 100 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

ఇదిలా ఉండగా, మార్చి 16వ తేదీన ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో టొవినో థామస్ నటించిన నరివెట్టా చిత్రం భారీ అంచనాలతో రిలీజ్‌కు సిద్దమైంది. అలాగే ధ్యాన్ శ్రీనివాసన్ హీరోగా డిటెక్టివ్ ఉజ్వలన్ చిత్రం కూడా రిలీజ్ అవుతున్నది. ఇంద్రజిత్ సుకుమారన్, అనశ్వర రాజన్ జంటగా నటించిన మిస్టర్ అండ్ మిస్టర్ బ్యాచ్‌లర్ సినిమా కూడా రిలీజ్ కానున్నది.
ఇవియే కాకుండా ఈ వారం (మే 16వ) రిలీజ్ అవుతున్న సినిమాల్లో యూకే ఓకే, ఆజాదీ, పోలీస్ టుడే, తెలివ్ సహితాన్, మూన్ వాక్, 916 కుంజుట్టన్, లవ్లీ, లాంటి సినిమాలు విడుదల కానున్నాయి. దాంతో ఈ వారం మలయాళ సినిమా రంగంలో సినిమాల సందడి ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఈ సినిమాల్లో చాలా వరకు కంటెంట్ ప్రధానంగా ఉండే సినిమాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, మే 16వ తేదీన తెలుగులో 23 సినిమా రిలీజ్ అవుతున్నది. ఈ సినిమాను మల్లేశం దర్శకుడు రాజ్ రాజకొండ రూపొందిండం గమనార్హం. ఇంకా ఈ వారం తెలుగులో ఎలెవన్, తమిళ డబ్బింగ్ చిత్రం డెవిల్ డబుల్ నెక్ట్స్ లెవెల్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇక తమిళంలో మామన్, కన్నడలో ఢీ, టకీలా, రిథమ్ సినిమాలు రిలీజ్ రెడీ అయ్యాయి. ఫైనల్ డెస్టినేషన్ బ్లడీనెస్, మిషన్ ఇంపాజిబుల్ ది ఫైనల్ రెకానింగ్ సినిమాలు హాలీవుడ్‌లో రిలీజ్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











