This Week Movie Releases వెండితెరపై మరోసారి మమితా బైజు మ్యాజిక్.. తెలుగు దక్షిణాదిల్లో రిలీజయ్యే సినిమాలు ఇవే!
ఇండియన్ సినిమా పరిశ్రమకు ఐపీఎల్, విద్యార్థుల పరీక్షలు ప్రతికూలంగా మారాయి. అయితే వివిధ కారణాలను దృష్టిలో పెట్టుకొని అగ్ర నిర్మాతలు, భారీ చిత్రాలను వాయిదా వేసుకొంటున్నారు. వేసవి సెలవులను టార్గెట్ చేసుకొని తమ సినిమాలను రిలీజ్ ప్లాన్ చేశారు. అయితే ఈ క్రమంలో చిన్న సినిమాలకు అవకాశం దక్కడంతో వాటిని ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ సినీ రంగాల్లో రిలీజ్ అవుతున్న సినిమాల వివరాల్లోకి వెళితే..
కన్నడ సినీ రంగంలో :కన్నడ చిత్ర పరిశ్రమలో మొత్తం నాలుగు సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఈ చిత్రాలన్నీ కంటెంట్‌ను నమ్ముకొని తీసిన చిన్న చిత్రాలే కావడం గమనార్హం. వాటిలో థూతు కాసు (Thooth Kaasu), మనసు (Manasu), రాక్షస తంత్ర (Rakshasa Tantra), దిల్ ఖుష్ (DilKush) చిత్రాలు ఉన్నాయి. రాక్షస తంత్ర చిత్రంలో మేఘా అక్షర, రక్షిత మాలిక్, థిలక్ కే, సుకేష్ ఏ, రషితా ఎన్ నటించారు. మేఘా అక్షర ఈ సినిమాకు నిర్మాతగా, దర్శకురాలిగా వ్యవరించారు. దిల్ కుష్ సినిమాలో రాజ్‌నీత్ దేవ్, స్పందన సొమన్న, రంగయాన రఘు, ధర్మాన కాదుర్ తదితరుల నటించారు.

బాలీవుడ్‌లో సినిమాలు:హిందీలో చిన్ని సినిమాలు రిలీజ్ అవుతన్నాయి. ఇప్పటికే షైతాన్ లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ అందుకొన్నది. ఈ క్రమంలో వాట్ ఏ కిస్మత్, గ్రాడ్యుయేట్ విత్ ఫస్ట్ క్లాస్, మ్యారేజ్. కామ్ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలు పెద్దగా బజ్ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
మలయాళ సినీ పరిశ్రమలో:మలయాళ చిత్ర పరిశ్రమ ఇటీవల కాలంలో భ్రమయుగం, ప్రేమలు, మంజుమ్మేల్ బాయ్స్ చిత్రాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకొన్నాయి. ప్రస్తుతం మార్చి 22వ తేదీన ఎన్నిత్తుమ్ నీయెనన్ే అరింజిలాల్లో, నలినాకాంతి, కతూడ్, సీక్రెట్ హోమ్, కాఫిర్ లాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ చిన్న చిత్రాలు భారీ విజయాలు అందుకొంటున్న నేపథ్యంలో ఈ సినిమాలు రావడంతో స్పెషల్ అటెన్షన్ క్రియేట్ అయింది.

తెలుగులో విడుదలయ్యే సినిమాలు ఇవే.. :తెలుగు సినిమా రంగంలో చిన్న చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఓం భీమ్ బుష్, హద్దులేదురా సినిమాలు మార్చి 22న ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే అలాగే కన్నడ చిత్రం లైన్‌మెన్ చిత్రం డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అవుతున్నది. శ్రీ విష్ణు, రాహుల్, ప్రియదర్శి నటించిన ఈ సినిమా ఇప్పటికే ఆడియెన్స్‌ను కనెక్ట్ అయింది.
తమిళంలో ఒక్కడే రెబెల్‌గా:తమిళంలో సినిమాల రిలీజ్ అంతగా కనిపించడం లేదు. ఎన్నికల వాతావరణం, విద్యార్థుల పరీక్షల కారణంగా భారీ ప్రాజెక్టుల విడుదల నిలిపి వేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రెబెల్ అనే సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. జీవీ ప్రకాశ్ కుమార్, మమితా బైజు , వెంకటేష్ వీపీ నటించిన ఈ సినిమా మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాకు నిఖేష్ దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











