Tollywood Movies: ఈవారం విడుదలయ్యే తెలుగు చిత్రాలివే.. అందరి ఫోకస్ ఒక్క సినిమాపైనే..
ఈవారం టాలీవుడ్ లో చాలానే సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అయితే పెద్ద పెద్ద హీరోల సినిమాల నుంచి మొదలుకొని చిన్న హీరోల వరకు చిత్రాలు విడుదలకు సిద్ధం అయ్యాయి. అయితే ఈ వారం విడుదలయ్యే చిత్రాలు వాటికి సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ల వివరాలు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
అందరి ఫోకస్ కస్టడీ పైనే..:
అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి హీరో హీరోయిన్లుగా కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తెరకెక్కించిన బైలింగువల్ చిత్రం కస్టడీ. అయితే ఈ సినిమాను మే 12వ తేదీ అంటే రేపే విడుదల చేస్తున్నారు. అయితే ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ రాగా రన్ టైమ్ ను 2 గంటల 27 నిమిషాల 57 సెకన్లకు ఫిక్స్ చేశారు. బాలీవుడ్ నటుడు శర్మాన్ జోషి, శ్రియా శరణ్ జంటగా మాజీ ఐఏఎస్ అధికారి పాపారావు బియ్యాల డైరెక్షన్ లో రాబోతున్న చిత్రం మ్యూజిక్ స్కూల్. అయితే ఈ సినిమా కూడా మే 12వ తేదీన విడుదల కాబోతుండగా.. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ సర్టిపికేట్ ఇచ్చింది. అలాగే రన్ టైమ్ ను 2 గంటల 10 నిమిషాలకు ఫిక్స్ చేసింది.

భువన విజయం - ఫర్హానా:
సునీల్ కీలక పాత్రలో కొత్త డైరెక్టర్ యలమంద చరణ్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం భువన విజయం. కామెడీ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని కూడా మే 12వ తేదీనే విడుదల చేయబోతున్నారు. అయితే ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ రాగా 1 గంట 58 నిమిషాల వద్ద సినిమాకు రన్ టైమ్ ఫిక్స్ చేశారు. ఐశ్వర్యా రాజేష్ ప్రధాన పాత్రలో నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ఫర్హానా. అయితే ఈ చిత్రాన్ని కూడా మే 12వ తేదీ అంటే రేపు రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ రాగా.. రన్ టైమ్ ను 2 గంటల 21 నిమిషాలకు ఫిక్స్ చేశారు.

ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్:
శేఖర్ అయాన్ వర్మ, వైభవి రావ్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన క్యూట్ లవ్ స్టోరీని మే 12వ తేదీన విడుదల చేయబోతున్నారు. ఓ సాయి డైరెక్షన్ లో రాబోతున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్టు యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అలాగే 2 గంటల 17 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేసింది. రవి ప్రకాశ్ బోడపాటి దర్శకత్వంలో.. థ్రిల్లర్ జోనర్ లో రాబోతున్న తాజా చిత్రం ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఈ చిత్రాన్ని మే 12వ తేదీన విడుదల చేయబోతుండగా... యూ/ఏ సర్టిఫికేట్ వ్చచింది. 2 గంటల 12 నిమిషాలకు సినిమా రన్ టైమ్ ను పిక్స్ చేశారు.

కథ వెనుక కథ - రెడీ:
విశ్వంత్ దడ్డుంపూడి, శ్రీజిత గౌష్, శుభ శ్రీ, అలీ. సునీల్, జయ ప్రకాశ్ వంటి వాళ్లతో కృష్ణ చైతన్య దర్శకత్వం వహించిన చిత్రం కథ వెనుక కథ. అయితే ఈ సినిమాను మే 12వ తేదీన విడుదల చేస్తుండగా.. యూ/ఏ సర్టిఫికేట్ వచ్చింది. సినిమా రన్ టైమ్ ను 2 గంటల 21 నిమిషాలకు ఫిక్స్ చేశారు. తన్నీరు రమేష్ దర్శకత్వంలో తాజాగా రాబోతున్న హర్రర్ థ్రిల్లర్ చిత్రం టీ బ్రేక్. అయితే ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికేట్ రాగా ఒక గంటా 56 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రాన్ని కూడా మే 12వ తేదీ అంటే రేపే రిలీజ్ చేస్తున్నారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ పోతినేని, జెనీలియా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రెడీ సినిమా రీరిలీజ్ కు సిద్ధం అయింది. మే 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్ రాగా 2 గంటల 53 నిమిషాల రన్ టైమ్ ను ఫిక్స్ చేశారు.


Click it and Unblock the Notifications










