»   » ఈ ఏడాది దిల్ రాజుదే.... 100 కోట్లకు‌పైగా డీల్స్!

ఈ ఏడాది దిల్ రాజుదే.... 100 కోట్లకు‌పైగా డీల్స్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఈ తరం నిర్మాతల్లో తనకంటూ ఓ బ్రాండ్ ఏర్పరుచుకున్న నిర్మాత ఎవరు? అంటే అందరూ ముందుగా చెప్పే పేరు దిల్ రాజు. నైజాం ఏరియాలో దిల్ రాజుకు ఉన్నంత పట్టు మరెవరీకి లేదు, పైగా ఆయనది లక్కీ బేనర్ అనే పేరుంది. అందుకే నిర్మించేది తామే అయినా ఆయన బేనర్లో రిలీజ్ చేస్తే సినిమా హిట్టవుతుందని నమ్మే నిర్మాతలు చాలా మంది ఉన్నారు.

గతంతో పోలిస్తే ఈ సంవత్సరం దిల్ రాజు జోరు ఓ రేంజిలో ఉందంటున్నారు ఇండస్ట్రీకి చెందిన వారు. శతమానం భవతి, నేను లోకల్ విజయాలతో ఈ సంవత్సరాన్ని మొదలు పెట్టిన దిల్ రాజు 'నమో వెంకటేశాయ' రూపంలో ఓ ఫెయిల్యూర్ కూడా తన ఖాతాలో వేసుకున్నారు. అయితే 2017 ద్వితీయార్థం దిల్ రాజుకు బాగా కలిసొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.

దిల్ రాజు చేతికే స్పైడర్

దిల్ రాజు చేతికే స్పైడర్

మహేష్ బాబు నటించిన ‘స్పైడర్' చిత్రాన్ని నైజాం ఏరియాలో దిల్ రాజే విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయన మినిమమ్ రూ. 26 కోట్ల బిజినెస్ చేస్తారని టాక్.

పవన్-త్రివిక్రమ్ మూవీ కూడా

పవన్-త్రివిక్రమ్ మూవీ కూడా

త్వరలో పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న సినిమాను కూడా దక్కించుకునేందుకు దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా ఆయన నైజాంలో మినిమమ్ రూ. 30 కోట్లు బిజినెస్ చేస్తారని టాక్.

దువ్వాడ జగన్నాథమ్

దువ్వాడ జగన్నాథమ్

దీంతో పాటు అల్లు అర్జున్ హీరోగా దిల్ రాజు ‘దువ్వాడ జగన్నాధమ్' సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా ఆయన నైజాం ఏరియాలో రూ. 20 కోట్ల బిజినెస్ చేస్తారని అంచనా.

ఎన్టీఆర్ సినిమాపై కన్ను

ఎన్టీఆర్ సినిమాపై కన్ను


జూ ఎన్టీఆర్ హీరోగా కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ‘జై లవ కుశ' సినిమా నైజాం రైట్స్ కూడా దిల్ రాజే దక్కించుకునే అవకాశం ఉంది. ఈ సినిమా కూడా 20 కోట్లకు తక్కువ కాకుండా బిజినెస్ చేస్తుందని అంచనా.

అన్నీ కలిపి రూ. 100 కోట్ల పైనే

అన్నీ కలిపి రూ. 100 కోట్ల పైనే

దీంతో పాటు దిల్ రాజు నిర్మాణంలో ఫిదా, రాజా ది గ్రేట్, నానితో ఓ సినిమా, సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా వస్తున్నాయి. ఇవన్నీ కలిస్తే ఈ ఏడాది దిల్ రాజు రూ. 100 కోట్లకు పైగా బిజినెస్ చేస్తున్నారని చర్చించుకుంటున్నారు.

English summary
Film Nagar source said that, Dil raju has a business of more than hundred crores in his pockets this year. Dil Raju, the producer and major distributor of Nizam area seems to be ruling the roost these days.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu