»   » ఆ 40 రోజుల్లో జరిగిన అద్భుతాలతో ‘తొలి కిరణం’

ఆ 40 రోజుల్లో జరిగిన అద్భుతాలతో ‘తొలి కిరణం’

Posted By:
Subscribe to Filmibeat Telugu

సువర్ణ క్రియేషన్స్ పతాకం పై జె జాన్ బాబు ధర్శకత్వం లో టి సుధాకర్ నిర్మిస్తున్న చిత్రం తొలి కిరణం. లోక రక్షకుడైన యేసు ప్రభువు మరణించిన తర్వాత 3వ రోజు సమాధి నుంచి తిరిగొచ్చిన తర్వాత నలభై రోజులు భూమ్మీద తిరిగారు. అప్పుడు అద్భుతాలు జరిగాయి. వాటిని ఎవరూ చూపలేదు. క్రీస్తు 40 రోజులు ఏం చేశారు? ఎవరెవరిని కలిశారు? మానవాళికి ఏం సందేశం అందించారు? అనే కథాంశంతో రూపొందుతున్న చిత్రం ఈ తొలి కిరణం. ప్రస్తుతానికి హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో పాటల చిత్రీకరణ జరుపుకుంటుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశం లో భాను చందర్ , చంద్ర బోస్, ఆర్‌పి పట్నాయక్ , దర్శకులు జాన్ బాబు మరియు నిర్మాత టి సుధాకర్ పాల్గూన్నారు.

భాను చందర్ మాట్లాడుతూ ‘ఈ చిత్రం లో మంచి పాత్ర చేస్తున్నాను, టైటిల్ చాలా బాగుంది. యేసు ప్రభు మరణించిన తర్వాత 40 దినాలు ఏమీ చేశారు అనే కథాంశం తో నిర్మించబడుతుంది . నాకు ఈ అవకాశం ఇచ్చిన జాన్ బాబు గారికి న కృతజ్ఞతలు'..

Tholi Kiranam Movie press meet

ఈ చిత్రానికి భాణీలు అందించిన చంద్ర బోస్ మాట్లాడుతూ'అని మతాలవారికి ఈ పాటలు నచ్చుతాయి, సాధారణ పదాలతో అందమై టూన్ లతో మంచి పాటలు కుదిరాయి. ఆర్‌పి పట్నాయక్ మంచి సంగీతం అందించారు. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన పాటకి మంచి స్పందన లభించింది..'.

ఈ చిత్రానికి సంగీతం అందించిన ఆర్‌పి పట్నాయక్ మాట్లాడుతూ ‘దర్శకుడుకి కథ మీద మంచి పట్టు ఉంది, మంచి పాటలు కుదిరాయి. కొంత బాగం సినిమా చూశాను, చిత్రీకరణ చాలా బాగుంది. క్రిస్మస్ సందర్భంగా విడుదలైన పాటకి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం విజయవంతం అవ్వాలని కోరుకుంటున్నాను'. అన్నారు.

దర్శకుడు జాన్ బాబు మాట్లాడుతూ ‘యేసు క్రీస్తు జీవిత కథ అదరంగా చిత్రికరిస్తున్నాము. కులమతలకు అతీతంగా నిర్మిస్తున్నాము. యేసు క్రీస్తు పాత్రలో పి‌డి రాజు అద్భుతంగా నటించారు. భాను చందర్ ఒక ముఖ్య పాత్రచేస్తున్నారు. ఆర్‌పి పట్నాయక్ మంచి సంగీతాని అందించారు .

ప్రొడ్యూసర్ టి. సుధాకర్ మాట్లాడుతూ ‘అందరం మంచి ప్లానింగ్ తో చిత్రని నిర్మిస్తున్నాము, నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు తమ సొంత సినిమాల పనిచేస్తున్నారు. విడుదల తర్వాత అని మతాల ప్రేక్షకులు ఈ చిత్రని అదరిస్తారు. ఆర్‌పి పట్నాయక్ అందించిన సంగీతం అతి త్వరలో విడుదల చేస్తాము. ఈ చిత్రని గుడ్ ఫ్రైడే కానుకగా మార్చ్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నాము.' అన్నారు.

ఈ చిత్రానికి కథ, మాటలు : రెవ రెండ్ టి. ఏ . ప్రభు కిరణ్, రచనా సహకారం : వి.ఎమ్. ఎమ్. ప్రవీణ్, సంగీతం : ఆర్‌పి పట్నాయక్, కెమెరా : మురళి కృష్ణ , ఎడిటింగ్ : వినయ్, ఆర్ట్ : విజయ్ కృష్ణ, సహ నిర్మాత : బి‌ఎస్ రెడ్డి, నిర్మాత : టి. సుధాకర్, స్క్రీన్ ప్లే , దర్శకత్వం : జే . జాన్ బాబు .

English summary
Tholi Kiranam Movie Directed by J Jaan Babu, Produced by T Sudhakar.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu