మెగా లిప్ కిస్ పోస్టర్ వైరల్.... యువతలో సెగలు రేపుతోంది!
Recommended Video

ఒకే ఒక్క పోస్టర్ చాలు సినిమాపై అటెన్షన్ పెంచడానికి. కొన్ని సార్లు పోస్టర్లో ఉండే హాట్ హాట్ అంశాలు కూడా సినిమాకు కలెక్షన్లు పెంచుతాయి. ఆ పోస్టర్లు చూసి ఎట్రాక్ అయి థియేటర్ల వెళ్లే ప్రేక్షకులు కూడా ఉంటారు. తాజాగా 'తొలి ప్రేమ' సినిమా ప్రమోషన్లు అలాగే సాగుతున్నాయి అనే వాదన వినిపిస్తోంది.

లిప్ కిస్ పోస్టర్ వైరల్
వరుణ్ తేజ్ నటించిన ‘తొలి ప్రేమ' చిత్రం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్టయింది. సినిమా విజయవంతంగా రెండో వారంలోకి అడుగు పెట్టిన సందర్భంగా హీరో హీరోయిన్ లిప్ కిస్ పోస్టర్ విడుదల చేశారు.

అలాంటి వారిని లాగేందుకే...
ఇంకా ‘తొలి ప్రేమ' సినిమా చూడని, ఈ సినిమాపై ఇంకా అటెన్షన్ రాని వారిని థియేటర్ల వైపు లాగేందుకే అన్నట్లు ముద్దు సీన్ పోస్టర్లు విడుదల చేసినట్లు స్పష్టమవుతోంది. ఇది కూడా ఒకరకమైన పబ్లిసిటీ అని చెప్పొచ్చు.

పొంగి పోతున్న మెగా ఫ్యామిలీ
ఈ సినిమా విజయంతో మెగా ఫ్యామిలీ పొంగిపోతోంది. ఈ విజయంపై చిరంజీవి ప్రెస్ మీట్ పెట్టి చిత్ర బృందాన్ని అభినందించారు. వరుణ్ తేజ్ నటన పరంగాను మెగా ఫ్యామిలీ గర్వపడేలా చేశాడు... అంటూ ప్రశంసించారు.

వసూళ్లు అదుర్స్
మరో వైపు బాక్సాఫీసు వద్ద తొలి ప్రేమ వసూళ్ల పరంగా అదరగొడుతోంది. తొలి 5 రోజుల్లోనే రూ. 10 కోట్లకుపైగా షేర్ వసూలు చేసింది. రెండో వారంలోనూ సినిమా బాక్సాఫీసు వద్ద స్ట్రాంగ్ గా రన్ అవుతోంది.


Click it and Unblock the Notifications











