పవన్ కళ్యాణ్ చెప్పేది నా బుర్రకు ఎక్కేది కాదు.. ప్రేమ కథ పూసగుచ్చినట్లు చెప్పింది!

Recommended Video

Tholi Prema Vasuki Talks About Pawan Kalyan

పవన్ కళ్యాణ్ తొలిప్రేమ చిత్రాన్ని ఎప్పటికి మరిచిపోలేం. ఆ చిత్రంలో పాత్రలు కూడా గుర్తుండిపోతాయి. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ చెల్లిగా నటించిన వాసుకి ఎక్కువగా సినిమాలు చేయలేదు. అయినప్పటికీ ఆమె అభిమానులందిరికి గుర్తుంటుంది. పవన్ కళ్యాణ్ కు సోదరిగా, అల్లరి పిల్లగా తొలిప్రేమలో బాగా నటించింది. తొలిప్రేమ చిత్రంతో పరిచయం అయిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని వాసుకి ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజగా ఓ ఇంటర్వ్యూలో వాసుకి తన ప్రేమ సంగతులు వివరించింది.

తొలిప్రేమ సమయంలో

తొలిప్రేమ సమయంలో

తొలి ప్రేమ చిత్రానికి ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేశాడు. వాసుకి పవన్ సోదరిగా నటించింది. షూటింగ్ సమయంలో తమ మధ్య స్నేహం ఏర్పడిందని వాసుకి తెలిపింది. సరదాగా మాట్లాడుకుంటుతూనే స్నేహితులుగా మారిపోయాం అని తెలిపింది.

గంటల తరబడి

గంటల తరబడి


షూటింగ్ అయిపోయాక ఫోన్ లో గంటల తరబడి మాట్లాడుకునేవాళ్ళం. ఆ సమయంలో మా ఇద్దరి మధ్య ప్రేమ ఉందనే సంగతి నాకు తెలియదు. సరదా విషయాలతో పాటు, సినిమా సంగతులు కూడా ఆనంద్ నాకు చెప్పేవారు.

 పెళ్లి ప్రస్తావన

పెళ్లి ప్రస్తావన

అందరిలాగా ప్రేమిస్తున్నాను అంటూ ప్రపోజ్ చేయలేదు, నేరుగా పెళ్లి ప్రస్తావనే తీసుకుని వచ్చాడు. మనమిద్దరం పెళ్లి చేసుకుందాం. ఒకరిని ఒకరం అర్థం చేసుకుంటున్నాం కాబట్టి పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడాడు.

కనిపెట్టలేకపోయా

కనిపెట్టలేకపోయా


ఆనంద్ సడెన్ గా పెళ్లి ప్రస్తావన తీసుకుని వచ్చేసరికి నేను తీసుకోలేకపోయా. ఆనంద్ ఎప్పుడూ ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నట్లు నాకు అనిపించలేదు. ఒక అబ్బాయి ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడో అమ్మాయికి అర్థం అవుతుంది. కానీ ఆనంద్ ని నేను కనిపెట్టలేకపోయా అని తెలిపింది.

 రెండు రోజులు

రెండు రోజులు

వెంటనే నాకు ఆ ఉద్దేశం లేదు అని చెప్పేశా. బలవంతం ఏమీ లేదని ఫోన్ పెట్టేశాడు. రెండు రోజులు ఫోన్ చేయలేదు. ప్రతి రోజు ఫోన్ లో మాట్లాడే వ్యక్తితో రెండు రోజులు మాట్లాడక పోయేసరికి నాకు ఏదోలా అనిపించింది.

స్నేహితుడిగా ఉండలేను

స్నేహితుడిగా ఉండలేను

ఆ తరువాత నేనే ఆనంద్ కు ఫోన్ చేశా. ఎందుకు ఫోన్ చేయలేదు అని అడిగా. నువ్వు ఇబ్బంది పడతావేమో అని చేయలేదు అని అన్నాడు. మనమిద్దరం స్నేహితులమే కదా అని అన్నాడు. పెళ్లి ప్రస్తావన వచ్చాకా నేను స్నేహితుడిగా ఉండలేను అని తెలిపాడు. ఆ తరువాత మళ్ళి 15 రోజులు మాటలు లేవు.

ఆ ఫీలింగ్

ఆ ఫీలింగ్


ఎక్కువ రోజులు ఆనంద్ తో మాట్లాడకపోయే సరికి అతడిని మిస్ అవుతున్నాననే ఫీలింగ్ కలిగింది. స్నేహితులని అడిగితే పెళ్ళికి అంగీకరించమని సలహా ఇచ్చారు. దేవుడికి ప్రార్థించి ఆనంద్ కు ఫోన్ చేసి ఓకె చెప్పేశా అని తన ప్రేమ కథని వాసుకి వివరించింది. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవిస్తున్నారు.

పవన్ చెప్పేది

పవన్ చెప్పేది

షూటింగ్ లో పవన్ కళ్యాణ్, ఆనంద్ ఇద్దరూ కలసి తనని ఆటపట్టించేవారని వాసుకి తెలిపింది. పవన్ కళ్యాణ్ నాకు చాలా మంచి స్నేహితుడు. పవన్ కళ్యాణ్ ఎంత సరదాగా ఉంటారో అంతే ఫాలాసఫీ కూడా చెప్పేవారు. నాకు అప్పటికి 18 ఏళ్ళు మాత్రమే కావడంతో ఆయన చెప్పే ఫిలాసఫీ ఎక్కేది కాదు. కానీ ఆయన చెప్పే ప్రతి విషయాన్ని వినేదానిని అని వాసుకి తెలిపింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X