అజ్ఞాతంలోకి మాస్ మహారాజ సినిమా.. దాడి షురూ..!
రవితేజ నటించిన టచ్ చేసి చూడు చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల మెప్పు పొందలేక పోయింది. విక్రం సిరికొండ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకుల సహనానికి పరీక్షగా మారింది. ఈ చిత్రంలో పాటు విడుదలైన యువ హీరో నాగ శౌర్య చిత్రం ఛలో మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పటికే దారుణంగా పడిపోయిన వసూళ్లతో ఎదురీదుతున్న టచ్ చేసి చూడు చిత్రానికి ఈ వారం పూర్తిగా దారులు ముసుకుపోనున్నాయి.

మొదలు కాబోతున్న మెగా హీరోల అటాక్
ఈ శుక్రవారం సాయి ధరమ్ తేజ్ నటించిన ఇంటెలిజెంట్ చిత్రం విడుదల కాబోతోంది. ఆ వెంటనే శనివారం రోజు వరుణ్ తేజ్ తొలి ప్రేమ చిత్రంతో రాబోతున్నాడు. ఈ రెండు సినిమాలపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మెగా హీరోల అటాక్ తో రవితేజ చిత్రం పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.
Recommended Video


నష్టాల బాటలో రవితేజ చిత్రం
రవితేజ గత చిత్రం రాజ ది గ్రేట్ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో టచ్ చేసి చూడు చిత్రంపై అంచనాలు పెరిగాయి. దీనితో చిత్ర బిజినెస్ కుడా బాగా జరిగింది. కాని ఈ చిత్రం అనూహ్యంగా నిరాశ పరచడం, ఈ వారం ఇద్దరు మెగా హీరోల చిత్రాలు విడుదల కానుండడంతో రవితేజ సినిమాకు నష్టాలు తప్పవని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.

రవితేజ రెమ్యునరేషన్ పై ఎఫెక్ట్
రాజా ది గ్రేట్ చిత్రానికి ముందు రవితేజ పారితోషకానికి సంబంధించి మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. రవితేజ పారితోషకం బాగా పడిపోయిందని, దీనితో రవితేజకు ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వడానికి నిర్మాతలు ముందుకు రాకపోవడంతో రవితేజకు బాగా గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. తాజగా టచ్ చేసి చూడు చిత్రంతో రవితేజ పారితోషకం గొడవ మొదటికి వచ్చినట్లైంది.

పద్ధతి మార్చుకోక తప్పదా
రవితేజ ఎంపిక చేసుకునే కథల విషయంలో పద్ధతి మార్చుకోవాలని లేకుంటే పరిస్థితి ఇంకా దారుణంగా మరే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications











