ఆయనలో నచ్చింది అదే.. ఇంకెవ్వరిలోనూ చూడలేదు.. ‘తొలిప్రేమ’ వాసుకి కామెంట్స్
తొలిప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి, ఆ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా ఉన్న ఆనంద్ సాయి మధ్య ప్రేమ చిగురించిన విషయం తెలిసిందే. ఆ తరువాత అనేక మలుపులు, గొడవల తరువాత చివరకు వివాహా బంధంతో ఒక్కటయ్యారు. మొదట్లో పెద్దలు అంగీకరించకపోయినా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరూ నాటి విషయాలను గుర్తు చేసుకున్నారు. అలీతో సరదాగా షోలో వచ్చిన ఈ ఇద్దరూ తమ ప్రేమ సంగతులను బయటకు చెప్పేశారు.

మొదట అలా..
మొదటి సారిగా పవన్ కళ్యాణ్ వల్లే ఆనంద్ సాయి పరిచయమయ్యాడు.. అలా వచ్చి చూసి పారిపోయాడు.. ఇలా ఎందుకు చేశాడు అని అనుకున్నాను.. మళ్లీ పవన్ కళ్యాణ్ పిలిస్తే వచ్చాడు.. అలా వచ్చి హాయ్ చెప్పి వెళ్లిపోయాడు అంటూ ఆనంద్ సాయితో మొదటి పరిచయం గురించి వాసుకి చెప్పుకొచ్చింది.

అలా ప్రపోజ్..
పెళ్లి చేసుకుందామా? అని నేరుగా అడిగేశాడు. కానీ నేను ఇలాంటివి వద్దని చెప్పాను. మళ్లీ నార్మల్‌గా ఫ్రెండ్స్‌లా ఉందామని చెప్పాను. కానీ అది కుదురదని అన్నాడు. పదో తరగతి చదివి ఇంటర్ వెళ్లొచ్చు.. కానీ ఇంటర్ చదివి పదో తరగతికి రాలేమని చెప్పి ఫోన్ కట్ చేశాడంటూ నాటి సంగతులను వాసుకి గుర్తుకు చేసుకుంది.

అదే ఇష్టం..
అయితే తన భర్తలో నచ్చిన విషయం గురించి వాసుకి చెప్పుకొచ్చింది. కష్టపడే తత్త్వం, అంకిత భావం చాలా ఇష్టం. ఓ పని తలపెట్టాడంటే దాని గురించే ఆలోచిస్తుంటారు.. అదే తపన ఉంటుంది.. రాత్రి అసలు పడుకోడు.. అదే ఆలోచిస్తుంటారు.. అది సినిమా సెట్ అయినా.. టెంపుల్ సెట్ అయినా నిత్యం ఆలోచిస్తూనే ఉంటారని వాసుకి చెప్పుకొచ్చింది.

ఇంకెవ్వరిలోనూ..
అలా ఓ పని పట్ల డెడికేషన్ ఉండటం, నిత్యం దాని గురించే ఆలోచించడం, చిన్న పనా? పెద్ద పనా? అని ఆలోచించుకుండా దాని గురించే తపన పడటం ఇంకెవ్వరిలోనూ చూడలేదంటూ వాసుకి చెప్పుకొచ్చింది. ఆయనకు మొదట్లో ఎక్కువగా కోపం ఉండేది.. కానీ ఇప్పుడు అంతగా లేదని వాసుకి తెలిపింది.

అదే నచ్చుతుంది..
ఇక ఆనంద్ సాయి తన భార్య వాసుకి గురించి చెబుతూ.. ఎలాంటి సమయంలోనైనా సరే పాజిటివ్‌గా మాట్లాడుతూ.. పాజిటివ్‌గా ఉంటుంది.. కుటుంబాన్ని ఎంతో చక్కగా చూసుకుంటుంది.. ప్రతీ విషయంలో ఎంకరేజ్ చేస్తుంటుందని అన్నాడు.


Click it and Unblock the Notifications











