Don't Miss!
- News జగన్ సంచలనం..వైఎస్ భారతికి కీలక బాధ్యతలు
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Sports SRH vs RCB: అందుకే వాషింగ్టన్ సుందర్‌పై వేటు వేసాం: ప్యాట్ కమిన్స్
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
ఆ రోజు పవన్ కళ్యాణ్ అలా.. చివరకు ఇంట్లో గొడవ.. తొలిప్రేమ వాసుకి కామెంట్స్
తెలుగు ప్రేక్షకులకు తొలి ప్రేమ సినిమా గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. అందులో పవన్ కళ్యాణ్ చెల్లెలిగా నటించిన వాసుకి అందరికీ గుర్తుండే ఉంటుంది. తొలిప్రేమ సినిమాకు పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేలేదు. ఆసినిమాలో సముద్రపు ఒడ్డున వేసిన తాజ్ మహల్ సెట్ అందరినీ అబ్బురపరిచింది. అలా ఆ సినిమా సమయంలోనే వాసుకి, ఆనంద్ సాయిల మధ్య ప్రేమ చిగురించింది. తాజాగా వాటి గురించి ఇప్పుడు వాసుకి ఆనంద్ సాయిలు నోరు విప్పారు.
అలా ఇద్దరూ..
తాజాగా వాసుకి, ఆనంద్ సాయిలు ఇద్దరూ కూడా అలీతో సరదాగా షోలో గెస్ట్లుగా వచ్చారు. అలీ కూడా తొలి ప్రేమ సినిమాలో నటించాడు. అలా ఈ ముగ్గురికి ఎప్పటి నుంచో బంధం ఉంది. అయితే ఇలా ఈ షోలో వాసుకి, ఆనంద్ సాయిలు ఎన్నో విషయాలు చెప్పుకొచ్చారు.
కాలేజ్ ఫ్రెండ్స్..
పవన్ కళ్యాణ్ నేను కాలేజ్ ఫ్రెండ్స్.. అప్పుడు పెట్రోల్‌కు పవన్ కళ్యాణ్ డబ్బులిచ్చేవాడు.. నా బైక్ మీద ఇద్దరం వెళ్లేవాళ్లం. నా దగ్గరున్న టాలెంట్‌ను గుర్తించింది పవన్ కళ్యాణ్. నాలో ఆర్ట్ ఉందని గుర్తించి ఇంత దూరం తీసుకొచ్చాడు అంటూ ఆనంద్ సాయి చెప్పుకొచ్చాడు.
పవన్ కళ్యాణ్ అలా చేశారు..
తొలిప్రేమ సెట్లో ఓ సారి పవన్ కళ్యాణ్ ఆనంద్‌ను పరిచయం చేశారు. అయితే అక్కడి వచ్చిన ఆనంద్.. నన్ను చూసి వెంటనే పారిపోయాడు. ఎక్కువగా మాట్లాడలేదంటూ నాటి మొదటి పరిచయాన్ని గుర్తుకు చేసుకుంది వాసుకి. అలా పవన్ కళ్యాణ్ చేయించిన పరిచయం ఇలా పెళ్లి వరకు వచ్చినట్టైంది.
ఇంట్లో గొడవ..
ఆనంద్ సాయి ఓ కథ చెప్పాడు.. స్నేహం కంటే ఎక్కువగా అయింది.. పదో తరగతి చదివి ఇంటర్‌కు వెళ్లొచ్చు. కానీ ఇంటర్ చదివి పదో తరగతికి రాలేమంటూ ప్రపోజ్ చేశారు.. ఇక ఇంట్లో కూడా మా విషయాన్ని చెప్పేశాను అంటూ వాసుకి ఇంట్లో జరిగిన గొడవల గురించి బయటపెట్టేసింది.
జాతకం, కులం..
నేను ఆనంద్ సాయి ప్రేమించుకున్నాం.. జాతకాలు, కులం వంటివి చూస్తానంటే చూసుకోండి.. కానీ అప్పుడు మీరు నా పెళ్లిలో ఉండే అవకాశం ఉండకపోవచ్చు అంటూ చెప్పేశానంటూ వాసుకి నాటి విషయాలను గుర్తుకు చేసుకుంది. అలా ఈ ఇద్దరి ప్రేమ సుఖాంతమైందట. ప్రోమోలోనే ఇన్ని విషయాలను చెప్పారంటే.. పూర్తి ఎపిసోడ్లో ఇంకెన్ని ముచ్చట్లు బయటపడతాయో చూడాలి.