షాకింగ్ : రామ్ చరణ్ ‘తుఫాన్’కు A రేటింగ్ ఎలా?

By Bojja Kumar

హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన తొలి బాలీవుడ్ మూవీ 'జంజీర్'. ఈ చిత్రం ఇటీవల ముంబైలోని సెన్సార్ బోర్డ్ నుంచి U/A రేటింగుతో సెన్సార్ సర్టిఫికెట్ పొందింది. అయితే ఇదే చిత్రం తెలుగులో 'తుఫాన్' పేరుతో విడుదలవుతోంది.

కాగా... తెలుగులో 'తుఫాన్' చిత్రానికి సెన్సార్ బోర్డ్ A రేటింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. A రేటింగ్ అంటే కేవలం పెద్దలు మాత్రమే చూడదగిన సినిమా అన్నమాట. హిందీ సెన్సార్ బోర్డు, తెలుగు సెన్సార్ బోర్డు ఒకే సినిమాకి ఇలా రెండు రకాలుగా రేటింగ్ ఇవ్వడంపై అభిమానులు అయోమయానికి గురవుతున్నారు.

బాలీవుడ్ దర్శకుడు అపూర్వ లఖియా దర్శకత్వం వహించిన 'జంజీర్' చిత్రం తెలుగు వెర్షన్ అయిన 'తుఫాన్' వ్యవహారాలన్నీ యొగి చూసుకున్నారు. హిందీ వెర్షన్ జంజీర్‌కి రెండు మైనర్ కట్స్ అనంతరం U/A సర్టిఫికెట్ పొందింది. మరి తెలుగులో ఎలాంటి కటింగులు లేక పోవడం వల్లనే A రేటింగ్ ఇచ్చారా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

1975లో అమితాబ్ హీరోగా వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ 'జంజీర్' చిత్రానికి రీమేక్‌గా అదే పేరుతో తెరకెక్కించారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ ఏసిపీ విజయ్ ఖన్నా పాత్రలో నటించాడు. షేర్ ఖాన్ పాత్రలో హిందీలో సంజయ్ దత్, తెలుగులో శ్రీహరి పోషించగా, మోనా డార్లింగ్ పాత్రలో నటించింది. తనికెళ్ల భరణి, దేవ్ గిల్ కీలకమైన పాత్రలు పోషించారు.

రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, అడాయ్ మెహ్రా ప్రొడక్షన్స్, మరియు ఫ్లయింగ్ టర్టిల్ ఫిల్మ్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించారు. బాలీవుడ్ హీరోల ఫేవరెట్ దర్శకుడు అపూర్వ లఖియా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రియాంక చోప్రా హీరోయిన్. శ్రీహరి ఇందులో ముఖ్య పాత్ర పోషించారు. ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు హైలెట్ కానుంది. హిందీలో సంజయ్ దత్ పోషించిన పాత్రను తెలుగులో శ్రీహరి పోషించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X