బరి నుంచి రామ్ చరణ్ ఔట్ - ఫ్యాన్స్‌కు నిరాశే!
హైదరాబాద్ : ఈ వార్త విన్న తర్వాత మెగా అభిమానులంతా నిరాశ పడటం ఖాయం. సంక్రాంతికి 'నాయక్' సినిమా చూసి ఫుల్లుగా ఎంజాయ్ చేసిన అభిమానులు సమ్మర్లో రామ్ చరణ్ నటించిన మరో సినిమా చూసేద్దామని ఎదురు చూస్తున్నారు. అయితే వారి ఆశ తీరేలా కనిపించడం లేదు.
తాజాగా ఫిల్మ్ నగర్ నుంచి అందిన సమాచారం ఏమిటంటే....సమ్మర్ బరిలో రామ్ చరణ్ సినిమా ఒక్కటి కూడా నిలవడం లేదట. రామ్ చరణ్ బాలీవుడ్లో నటిస్తున్న జంజీర్ మూవీ తెలుగులో తుఫాన్ పేరుతో విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం సమ్మర్లో రిలీజ్ అవుతుందని అనుకున్నప్పటికీ సినిమా అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడం, ప్రమోషన్స్ నిర్వహించడానికి ఎక్కువ సమయం తీసుకోవాలనే ఆలోచనతో ఈచిత్రాన్ని సమ్మర్ బరి నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
తుఫాన్ చిత్రం జులై లేదా ఆగస్టు నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్ల వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు. బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా రామ్ చరణ్ తో రొమాన్స్ చేస్తోంది. ఈ చిత్రం గతంలో అమితాబ్ నటిచిన జంజీర్ చిత్రానికి రీమేక్.
మరో వైపు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్న 'ఎవడు' చిత్రం కూడా సమ్మర్లో విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదు. ఈచిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదల కావడానికి జూన్ నెలాఖరు లేదా, జులై మొదటి వారం పట్టే అవకాశం ఉంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన శృతి హాసన్ హీరోయిన్.


Click it and Unblock the Notifications