'రక్త చరిత్ర' చిత్రంలో ఒకరినొకరు ప్రేమతో కౌగిలించుకునే ఫ్యామిలీలు లేవు..ఇది కేవలం రెండు కుటుంబాల మధ్య గొడవలనే చూపెడుతుంది. కాబట్టి 'కభి ఖుషీ కభి గమ్' చిత్రాన్ని ఇష్టపడేవారు.. "రక్త చరిత్ర" కు దూరంగా ఉండటం మంచిది అంటూ రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేసారు. ఇక "రక్త చరిత్ర" చిత్రం ఈ నెల 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఈ చిత్రం గురించి నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ... రాము గారు ఏది చేసినా అది సంచలనమే. శివతో చైన్ తెంపించినా ఇప్పుడు పంపు కింద కత్తి కడుగుతున్నా సంచలనమే. ఎవ్వరినీ భాద పెట్టేవిధంగా కాకుండా అందరిని ఆలోచింప చేసే విధంగా ఈ ప్రాజెక్ట్ ని రాము గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందించారు. తప్పక అందరిని ఆకట్టుకుని బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అని అన్నారు.