For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఒక వైపు అర్జున్ రెడ్డి ఆఫర్.. మరోవైపు నాన్న మరణం.. తోట రాజు

  By Rajababu
  |

  అర్జున్ రెడ్డి. టాలీవుడ్ లో ఎవర్ని కదిలించినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. మంచి కంటెంట్.. నటీనటుల సూపర్బ్ పర్ఫార్మెన్స్.. క్వాలిటీ పిక్చరైజేషన్.. ఇలా ప్రతి విషయం గురించి.. చాలా బాగుందని అంటున్నారు. సినిమా ఇంత బాగా రావడంలో.. స్క్రీన్ పై సినిమా రిచ్ గా కనిపించడంలో.. ప్రతి ఫ్రేమ్ ను సీరియస్ గా తెరకెక్కించారు... అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ.. తోట రాజు. ఈ సినిమా మేకింగ్ తో పాటు.. పర్సనల్ లైఫ్ గురించి మరిన్ని వివరాలను ఆయన వన్ ఇండియాతో పంచుకున్నారు. ఆ డిటెయిల్స్ మీ కోసం.

  హాయ్ తోట రాజు గారూ.. కంగ్రాట్స్. అర్జున్ రెడ్డి హిట్టయినందుకు..

  థ్యాంక్స్. చాలా సంతోషంగా ఉంది.

  ఫొటోగ్రఫీ వైపు ఎలా వచ్చారు?

  ఫొటోగ్రఫీ వైపు ఎలా వచ్చారు?

  మాది నల్లగొండ జిల్లా సూర్యాపేట. మా నాన్నగారు తోట వెంకట్.. చిన్నప్పుడే ఫిల్మ్ ఇండస్ట్రీ వైపు వచ్చారు. ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ గా చేశారు. మోహన్ బాబు గారి దగ్గర 18 ఏళ్లుగా మేకప్ అసిస్టెంట్ గా చేశారు. అప్పటివరకూ నా చదువు పూర్తయింది. ఆ టైమ్ లో నాకు తెలియకుండానే.. నాన్నగారు చేసే వృత్తి మీద నాకు క్రేజ్ ఏర్పడింది. ఎప్పటికైనా ఇండస్ట్రీకే వెళ్లాలని చిన్నప్పుడే మెంటల్ గా ఫిక్స్ అయ్యా. కేఎస్ ప్రకాశ్ గారి సూచనతో.. సురేందర్ రెడ్డి అనే ఫొటోగ్రాఫర్ దగ్గర అసిస్టెంట్ గా చేరా. తర్వాత.. బాంబేకు వెళ్లా. పెళ్లి చూపులు సినిమాకూ కొన్ని రోజులు పని చేశా. అలా.. ఇండస్ట్రీలో సెటిల్ అయ్యాను.

  అర్జున్ రెడ్డి అవకాశం ఎలా వచ్చింది?

  అర్జున్ రెడ్డి అవకాశం ఎలా వచ్చింది?

  బాంబేలో షూట్ లో ఉన్నప్పుడు.. నాకు విజయ్ దేవరకొండ రెఫరెన్స్ తో ఓ కాల్ వచ్చింది. అదే టైమ్ లో.. మా నాన్నగారికి ఆరోగ్యం బాలేదని తెలిసింది. తర్వాత.. ఆయన చనిపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే హైదరాబాద్ బయల్దేరాల్సి ఉంది. అదే టైమ్ లో ఫోన్ రావడంతో.. షూటింగ్ లో ఉన్నానని చెప్పి ఇంటికి వెళ్లిపోయా. తర్వాత.. అంత్యక్రియలు పూర్తయ్యాక.. మరోసారి ఫోన్ వచ్చింది. అలా.. ఇంట్లో పని పూర్తి చేసుకుని వెళ్లే వరకూ వాళ్లు ఓపిగ్గా ఉన్నారు. నేను వాళ్లకు విషయం చెప్పిన తర్వాత.. ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకున్నాం. నా గురించి వాళ్లు ఏమీ ఎంక్వైరీ చేయలేదు. నమ్మకంగా అవకాశం ఇచ్చారు. సబ్జెక్ట్ లైన్ మాత్రమే చర్చించుకుని.. సినిమాను మొదలు పెట్టాం. కాకపోతే.. అప్పటికే వాళ్లకి షూట్ ఎక్కడ చేయాలన్నదానిపై అవగాహన ఉంది.

  స్క్రిప్ట్ చూశాక.. హిట్ అవుతుందని అనిపించిందా?

  స్క్రిప్ట్ చూశాక.. హిట్ అవుతుందని అనిపించిందా?

  ఇలాంటి సినిమాలు బాంబే కల్చర్ కు సూటవుతాయి. కానీ.. తెలుగులో హిట్ అవుతాయా అన్న కాస్త భయం వేసిన మాట నిజమే. కానీ.. ఎక్కడో కాన్ఫిడెన్స్ ఉండేది. ఇప్పుడదే నిజమైంది. సినిమా రియలిస్టిక్ గా వచ్చేందుకు కాస్త హోమ్ వర్క్ కూడా చేశాను.

  డీఓపీ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు?

  ఫ్రెష్ లుక్ తెచ్చేందుకు చాలా ప్రయత్నించాం. కెమెరాతో స్టోరీ ప్లే చేయకుండా.. కేరెక్టర్స్ తో ప్లే అయ్యేలా జాగ్రత్త పడ్డాం. ఫుట్ బాల్ మ్యాచ్ సీన్లను లెన్స్ లేకుండా.. షూట్ చేశాం. పని విషయంలో అంతగా బాధ పడిన సందర్భాలైతే లేవు కానీ.. టెక్నికల్ గా కష్టపడ్డాం. క్లాస్ రూమ్ లో.. మాకీ-డైలాగ్ పార్ట్ కోసం.. సాయత్రం వరకూ షూట్ చేస్తూనే ఉన్నాం. వెడ్డింగ్ కార్డ్ ఇచ్చే సీన్స్ ను మా ఆఫీస్ లోనే షూట్ చేశాం.

  డైరెక్టర్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్?

  డైరెక్టర్ తో మీ వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్?

  చాలా బ్రిలియంట్ గా అనిపించింది. ఆయనకు సినిమా తప్ప మరో ప్రపంచం లేదు. ప్రతి విషయాన్ని కేరింగ్ గా చూసుకుంటారు. ఆర్టిస్టులను బాగా చూస్తారు.

  విజయ్.. వర్కింగ్ ఎక్స్ పీరియెన్స్ ఎలా ఉంది?

  చాలా బాగుంది. అతని యాక్టింగ్.. నాకు బరువును దించింది. ఎప్పుడూ.. కెమెరాను మోస్తున్న ఫీల్ కలగలేదు. చాలా వండర్ ఫుల్ గా యాక్ట్ చేశాడు.. విజయ్.

  కెమెరాతో ప్రయోగాలు చేసే ఆలోచన ఉందా?

  కెమెరాతో ప్రయోగాలు చేసే ఆలోచన ఉందా?

  స్క్రిప్ట్ ఆధారంగానే ఏదైనా చేయగలం. అదొక్కటే కాదు. షూటింగ్ కు వెళ్లినపుడు స్పాట్ ఆంబియెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అవన్నీ సహకరిస్తేనే.. ఏదైనా కొత్తగా చేయగలం. అవసరానికి తగినట్టుగా ఫొటోగ్రఫీ మార్చుకునే ప్రయత్నం చేస్తా. నీది నాది..ఒకే ప్రేమ కథ సినిమాలో ప్రయోగానికి ప్రాధాన్యత ఇచ్చాం. ఫొటోగ్రఫీని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాం. సినిమా వస్తే.. మేం ఎంత కష్టపడ్డామో తెలుస్తుంది. ప్రతి ఫ్రేమ్ లోనూ ఒక బ్రీత్ మూడ్ క్రియేట్ చేసి.. ఆడియెన్స్ కు కథను దగ్గరగా తీసుకెళ్లే ప్రయత్నం చేశాను. ఇకపై కూడా.. కథ ప్రకారం ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నా

  మీకు నచ్చిన ఫొటో గ్రాఫర్?

  మీకు నచ్చిన ఫొటో గ్రాఫర్?

  నేను ఒకళ్లను ఫాలో అవను. ఒకళ్లనే ఇష్టపడను. అందరినీ ఇష్టపడతా. చోటా కే నాయుడు చేసే కొన్ని సినిమాలు.. చాలా బాగా నచ్చుతాయి. ఆయన యాక్షన్ సినిమాలను చాలా స్పీడ్ గా కొనసాగేలా.. డీఓపీ చేయగలరు. అలాంటివి బాగా నచ్చుతాయి. రీసెంట్ గా ఫిదాకు విజయ్ కుమార్ చేసిన డీఓపీ నచ్చింది. టెక్నాలజీ ప్రకారమే ఇష్టపడతాను తప్పు.. ఒకళ్లనే ఇష్టపడతానని చెప్పలేను.

  అర్జున్ రెడ్డిలో మీకు నచ్చిన సీన్లు?

  క్లైమాక్స్ సీన్ చాలా బాగా నచ్చింది. సన్ లైట్ మూడ్ క్రియేట్ చేశాం. ఆ సీన్ బాగా వచ్చింది. అందరికీ నచ్చింది.

  కొత్త ప్రాజెక్టులు కమిట్ అయ్యారా? డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా?

  కొత్త ప్రాజెక్టులు కమిట్ అయ్యారా? డైరెక్షన్ చేసే ఆలోచన ఉందా?

  ఇంకా ప్లాన్ చేసుకోలేదు. కానీ.. అవకాశాలు వస్తున్నాయి. జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలని చూస్తున్నా. నా ఫస్ట్ టార్గెట్ డైరెక్షనే. కానీ.. టెక్నికల్ గా ఎదిగితె.. లైఫ్ సేఫ్ గా ఉంటుందన్న ఆలోచనగా డీఓపీ వైపు వెళ్లాను. అన్నీ సాధించాకే.. డైరెక్షన్ వైపు వెళ్తా.

  ఫొటోగ్రఫీలోకి వచ్చేవాళ్లకు మీరు ఇచ్చే సలహా?

  డైరెక్టర్ తో ముందు కో ఆర్డినేట్ కావాలి. వాళ్లు చెప్పే విషయాన్ని సరిగా అర్థం చేసుకోవాలి. డైరెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ ఆలోచిస్తాడు కాబట్టి.. ఆ స్థాయిలో ఆలోచించగలగాలి. డైరెక్టర్ చెప్పే మాటను వినాలి. అప్పుడే.. బెటర్ అవుట్ పుట్ వస్తుంది.

  లిప్ లాక్ లకు టేక్ లు ఎన్ని తీసుకున్నారు?

  లిప్ లాక్ లకు టేక్ లు ఎన్ని తీసుకున్నారు?

  మేం కౌంట్ చేయలేదు. కానీ.. ఒక్కో సీన్ కు.. ఒకటీ, రెండు టేక్స్ లో పూర్తి చేశాం. అలాగే.. వాళ్లు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారన్నది నేను ఆలోచించలేదు. కెమెరా యాంగిల్స్ పైనే కాన్సన్ ట్రేట్ చేశాం.

  ఇంటిమేట్ సీన్స్ లో హీరోయిన్ మూడ్ ఎలా ఉండేది?

  హీరోయిన్ గతంలో థియేటర్ ఆర్టిస్ట్. ఆమె షూటింగ్ లోకి రాగానే.. కేరెక్టర్ లోకి వెళ్లిపోయేది. ప్రీతిలా మారిపోయేది. సో.. మాక్కూడా ఏదో షూట్ చేస్తున్నట్టుగా.. లిప్ లాక్ ను చూపిస్తున్నట్టుగా అనిపించలేదు. ఆ సీన్ ను వల్గారిటీగా మేం భావించలేదు. హీరో హీరోయిన్ల మధ్య ఉన్న ఎఫెక్షన్ అలాగే ఉంటుంది. అది అలాగే చూపించాం.

  స్క్రిప్ట్ ను సడన్ గా మార్చిన సందర్భాల్లో.. ఏమైనా కన్ ఫ్యూజ్ అయ్యారా?

  స్క్రిప్ట్ ను సడన్ గా మార్చిన సందర్భాల్లో.. ఏమైనా కన్ ఫ్యూజ్ అయ్యారా?

  అలాంటి సన్నివేశాలు మాకు అర్థమైపోతాయ్. కానీ.. అది ప్లస్ అయినపుడు మాకు ఇబ్బంది కాదు. మైనస్ గా అనిపించన సీన్లను తీసేసి.. మళ్లీ షూట్ చేస్తాం.

  సినిమాలో శివ కేరెక్టర్ ఇంత సక్సెస్ అవుతుందని అనుకున్నారా?

  అనుకున్నాం. ఆ కేరెక్టర్ కు తగ్గట్టే.. రాహుల్ (శివ) చాలా జాలీగా ఉంటాడు. ఈ కేరెక్టర్ ఇంత సక్సెస్ అవుతుందని ముందే ఊహించాం.

  కాంచనగారితో పని చేయడం ఎలా అనిపించింది?

  కాంచనగారితో పని చేయడం ఎలా అనిపించింది?

  చాలా అద్భుతంగా అనిపించింది. ఆమె కేరెక్టర్ సినిమాకు మంచి లుక్ తెచ్చింది. అందరితో చాలా బాగా మాట్లాడేది. ఆమెను సినిమాలో నటింపజేసిన క్రెడిట్.. దర్శకుడిదే. ఆమె నాచురల్ ఎక్స్ ప్రెషన్స్ ఇచ్చినపుడు.. అంతే సహజంగా.. ఆమెకు తెలియకుండానే టేక్స్ ఓకే చేశాం.

  సినిమాకు ముందు శర్వానంద్ ను అనుకున్నారట?

  సినిమాకు ముందు శర్వానంద్ ను అనుకున్నారట?

  అవును.. శర్వానంద్ తో పాటు.. అల్లు అర్జున్ ను కూడా అనుకున్నాం. కానీ.. ఫైనల్ గా విజయ్ తో చేశాం.

  బాలీవుడ్ లో మీరు చేసిన ప్రాజెక్టులు?

  బాలీవుడ్ లో మీరు చేసిన ప్రాజెక్టులు?

  ఇష్కియా, లూట్ లాంటి సినిమాలకు పని చేశాను. మణిశంకర్ తో జర్నీ చాలా బాగా అనిపించింది. బాంబేలో దాదాపు ఐదేళ్లు ఉన్నా. కొన్ని కమర్షియల్ యాడ్స్ కూడా చేశాను.

  కెమెరా, మేకప్ డిపార్ట్ మెంట్లకు కో ఆర్డినేట్ ఎలా ఉంటుంది?

  కెమెరా, మేకప్ డిపార్ట్ మెంట్లకు కో ఆర్డినేట్ ఎలా ఉంటుంది?

  చెప్పాలంటే.. తెలుగులో ఆ సమన్వయం కాస్త తక్కువగానే ఉంటుంది. ఒక్కోసారి.. మేం చెప్పేది వాళ్లు వినరు. అది ఫొటోగ్రఫీకి కాస్త ఇబ్బందిగా మారుతుంటుంది.

  అర్జున్ రెడ్డికి సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు?

  అర్జున్ రెడ్డికి సౌండ్ ఎఫెక్ట్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టున్నారు?

  అవును. నాయిస్ పొల్యూషన్ ను క్లియర్ చేసేందుకు చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. చెన్నైలో మిక్సింగ్ చేయించాం. రీ రికార్డింగ్ విషయంలో ఎక్కడా ఇబ్బంది రాకుండా.. ఉండేలా జాగ్రత్తపడ్డాం.

  English summary
  Arjun Reddy movie has become a sensational hit in Tollywood. Cinematography is one of the key factor behind the success, Thota Raju's photography has become talk of the entire film industry. In this occassion, budding cinematographer talked to Filmibeat Telugu exclusively.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X