twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తోట తరణి గురించి ఇది ఆశ్చర్యకరమైన వార్త

    By Srikanya
    |

    హైదరాబాద్ : సాధారణంగా తెర వెనక ఉండేవారు...తెర ముందుకు రావటానికి ఇష్టపడరు. అయితే ఒక్కోసారి తెరమీద రావాల్సిన పరిస్ధితులు డిమాండ్ చేస్తూంటాయి. ప్రస్తుతం ప్రముఖ కళా దర్శకుడు తోట తరణికి అలాంటి సిట్యువేషనే ఎదురైంది. ఆయన త్వరలో తెరపై కనిపించి అలరించనున్నారు. అదీ స్వామి చిన్మయానంద పాత్రలో.

    'ద క్వెస్ట్' పేరుతో రూపొందుతోన్న ఆంగ్ల డాక్యుమెంటరీ కోసం తోట తరణి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆధునిక యుగంలో గొప్ప ఆధ్యాత్మిక వేత్తగా పేరు పొందిన వ్యక్తి స్వామి చిన్మయానంద. చిన్మయ మిషన్‌ను స్థాపించి వేదాల్లోని విలువలను ప్రచారం చేయడానికి పాటు పడింది ఆయనే. గతంలో 'కల్యాణ సమయల్ సాదం' చిత్రాన్ని తెరకెక్కించిన ఆర్.ఎస్.ప్రసన్న ఈ డాక్యుమెంటరీని తీర్చిదిద్దుతున్నారు.

    తోటతరణి మాట్లాడుతూ... , "కొద్ది నెలల క్రితం ఈ ప్రాజెక్టు నా దగ్గరకు వచ్చింది. అందరికీ తెలుసు...నేను తెర వెనకే చాలా కంఫర్ట్ బుల్ గా ఉండగలను. నాకు కెమెరా ముందుకు రావటంపై ఆసక్తి ఉండదు. అయితే మేకర్స్ నేనే చేయాలని అన్నారు. అది ఆధ్యాత్మికమైన స్క్రిప్టు. అంతేకాకుండా చాలా మంది నేను స్వామి చిన్మయానందలా ఉన్నానని అన్నారు. దాంతో నాకేం చెయ్యాలో అర్దం కాలేదు. చివరకు దర్శక,నిర్మాతలు నన్ను ఒప్పించారు ." అని చెప్పుకొచ్చారు. అయితే ఈ డాక్యుమెంటిరీలో ఆయనది చిన్న పాత్రే. క్లైమాక్స్ లో స్వామీజి గా కనిపిస్తారు.

    Thota Tharani as Swami Chinmayananda in a documentary

    దర్శకడు ప్రసన్న మాట్లాడుతూ "మన మధ్య తిరిగి, మన మనస్సుల్లో నుంచి ఇంకా పూర్తిగా మాయం కాని వ్యక్తులకు సంబంధించిన బయోపిక్‌లను తెరకెక్కించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. చిన్మయానందకు సంబంధించిన పాత్రను ఎవరు వేస్తే బావుంటుందనే ఆలోచనతో తర్జనభర్జన పడ్డాను. సరిగా ఆ సమయంలోనే కాస్ట్యూమ్ డిజైనర్ ప్రీతి నాకు తోట తరణిగారి పేరును సజెస్ట్ చేసింది.

    ప్రీతి అంతకు ముందు తోట తరణిగారి దగ్గర సహాయకురాలిగా చేసింది. తన మాట ప్రకారం నేను తరణిగారిని కలిశాను. ఆయన కూడా చేయడానికి ఒప్పుకున్నారు. ఈ పాత్రలో నటించినందుకు ఓ పైసా కూడా ఆయన తీసుకోలేదు. ఆధ్యాత్మిక విలువల కోసం చేస్తున్నానని నాతో అన్నారు'' అని ప్రసన్న చెప్పారు.
    షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ డాక్యుమెంటరీని ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తోట తరణి గతంలో రజనీ శివాజీ చిత్రంలో ఇంట్రడక్షన్ సాంగ్ లో కొద్ది క్షణాలు పాటు మెరిసారు.

    English summary
    Thota Tharani, Chennai’s most famous art director, will essay his first major role in a film. The movie, titled The Quest, is an English documentary that will portray the life and times of Swami Chinmayananda, who was instrumental in the formation of the Chinmaya Mission.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X