ఐశ్వర్యారాయ్ అందం చూసి శ్రీదేవి తట్టుకోలేకపోయేది
Sridevi: అతిలోకసుందరి శ్రీదేవి. తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటించి మెప్పించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది శ్రీదేవి. అయితే.. ఆమె ఆకాల మరణం కేవలం ఇండస్ట్రీ కే కాకుండా.. కోట్లాదిమంది అభిమానులకు తీరని లోటు. ఎంతోమంది అభిమానాన్ని, పుష్కారాలను అందుకున్న శ్రీదేవిపై ఓ టాలీవుడ్ రచయిత వివాదాస్పద కామెంట్స్ చేశారు.
అందాల తార శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం, సినిమా అంటే ఫ్యాషన్. కష్టపడే మనస్తత్వం ఆమె సొంతం. ఆమె నటప్రస్థానం బాల నటిగా తెలుగు చిత్రసీమలో ప్రారంభమైంది. పదహారేళ్ల వయస్సు అనే సినిమాతో హీరోయిన్ గా వెండితెరపై మెరిచింది. ఆ తరువాత వరుస విజయాలను అందుకుంటూ.. ఎంతోమంది స్టార్ హీరో ల సరసన నటించిన మెప్పించింది.

చిత్రసీమలో శ్రీదేవీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆమెకు నటనపై ఉన్న ఇష్టం, మక్కువ, కసి వల్లనే కోట్ల మంది అభిమానులు ఫిదా చేసింది. సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తారలు ఉన్నశ్రీదేవి మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ అందుకుంది. తన సినీ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా క్రమశిక్షణతో మెలిగింది. వందలాది సినిమాలలో నటించి, ఆల్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకుంది.
అలాంటి అతిలోక సుందరి శ్రీదేవి పై సినీ రచయిత తోటపల్లి మధు సంచల వ్యాఖ్యలు చేశారు. అతిలోక సుందరి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఓ ఇంటర్వ్యూలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీదేవికి వ్యసనాలు ఉన్నాయని, ప్రతిరోజు తాగుతుండేది అని షాకింగ్ కామెంట్స్ చేశారు. 'మేకప్ ఒకసారి అలవాటు అయ్యాక వేసుకోకపోతే పిచ్చెక్కుతుంది. ఆర్టిస్టులందరికి అదొక ఆనందం. శ్రీదేవి గారు చిన్నప్పటి నుండి మంచి ఫేమ్ సంపాదించుకుంది, కానీ, 55 ఏండ్లు వచ్చే వరకు హైపర్ టెన్షన్, ఇంఫియార్టీ కాంప్లెక్స్, మెంటల్ టెన్షన్స్ తో బాధపడేది.' అన్నారు.
'ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్స్ వస్తున్నారు. బాలీవుడ్ ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్ లాంటి హీరోయిన్స్ వరుస విజయంతో దూసుకుపోతున్నారు. వారి నుండి పోటీ ఎలా తట్టుకోవాలి. వారితో ఎలా పోటీపడాలి. ఈ సమయంలో ఆమె కాస్త ఇన్ఫియార్టీ కాంప్లెక్స్ లోనయింది. దీంతో మరింత అందంగా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవడం మొదలుపెట్టింది. అలా ముక్కు, మూతికి సర్జరీలు చేయించుకుంది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

అంతటితో ఆగకుండా.. డైటింగ్ పేరిట సరిగా తినేది కాదు. పైగా డ్రింక్ చేసేది. హై డయాబెటిస్. ఆమె వ్యసనాలకు అలవాటు పడింది. ప్రతిరోజు డ్రింక్ చేసింది' అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీలో చాలామంది యాక్టర్స్ డ్రగ్స్ కు అలవాటు పడిపోయారని, డ్రింక్ అయితే లివర్ డ్యామేజ్, కిడ్నీస్ ఫెయిల్యూర్ వంటి సమస్యలు వస్తున్నాయని, వారి వ్యక్తిగత డాక్టర్లే డ్రగ్స్ సజెస్ట్ చేస్తున్నారంటూ మరో వివాదాస్పద కామెంట్ చేశారు రచయిత తోటపల్లి మధు. ఈ వ్యాఖ్యలను శ్రీదేవి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చనిపోయిన వారిపై అనవసరంగా ఇష్టం ఉన్నట్లు మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు.


Click it and Unblock the Notifications











