ఆమె ప్రతి రోజు డ్రింక్ చేసేవారు.. శ్రీదేవి మరణంపై నోరుపారేసుకున్న రచయిత
Sridevi: అందాల రాసి అతిలోకసుందరి శ్రీదేవి. తెలుగు తమిళం హిందీ భాషలలో నటించి మెప్పించింది. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని.. కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకుంది. అయితే.. ఆమె అకాల మరణం కేవలం ఇండస్ట్రీ కే కాకుండా.. కోట్లాదిమంది అభిమానులకు తీరని లోటు. ఆమె దూరమై ఆరు సంవత్సరాలు గడుస్తుంది. ఇటీవల టాలీవుడ్ రచయిత ఆమె మరణం పై షాకింగ్ కామెంట్స్ చేశారు. శ్రీదేవి గురించి షాకింగ్ విషయాలను వెల్లడించారు.
అందాల తార శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అందం, అభినయం, చలాకితనం, సినిమాలంటే ఫ్యాషన్ కష్టపడే మనస్తత్వం ఇవన్నీ కలగలిపిన వ్యక్తిత్వం శ్రీదేవి సొంతం. టాలీవుడ్ లో ప్రారంభమైన ఆమె నట ప్రస్థానం బాలీవుడ్ వరకు కొనసాగింది. ఎంతోమంది స్టార్ హీరో ల సరసన నటించిన మెప్పించింది. చిత్రసీమ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇండస్ట్రీలో తొలిసారిగా లేడీ సూపర్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది నటి శ్రీదేవి. ఆమెకు నటనకు కోట్ల మంది అభిమానులు ఫిదా అయ్యారు.

తారలెన్ని ఉన్న ధృవతార ఒక్కటే అన్నట్లు సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది తారలు వచ్చిన శ్రీదేవి మాత్రం ప్రత్యేకం అని చెప్పవచ్చు. తన 50 ఏళ్ల నట ప్రస్థానంలో ఎన్నో హిట్స్, సూపర్ హిట్స్ అందుకుంది. తన సినీ జీవితంలో ఎలాంటి వివాదాలకు తావు లేకుండా క్రమశిక్షణతో మెలిగింది. ఆమె ఏదైనా సినిమా ఒప్పుకుంటే.. ఆ సినిమా పూర్తి అయేంతవరకు దానిపై దృష్టికి పెట్టేది. తన 100 పర్సెంట్ ఎఫెక్ట్ ఆ సినిమాపై పెట్టేది. అందుకే వందలాది సినిమాలలో నటించి, ఆల్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకుంది. ఇలాంటి గౌరవం దక్కడం చాలా అరుదు. కానీ అలాంటి శ్రీదేవి పై ఓ సినీ ప్రముఖుడు సంచల వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాలి. ఆమెకు వ్యసనాలు ఉన్నాయని, ప్రతిరోజు తాగుతుండేది అని షాకింగ్ కామెంట్స్ చేశారు.
ఆ వ్యక్తి ఎవరో కాదు ప్రముఖ రచయిత తోటపల్లి మధు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆయన శ్రీదేవి మరణం పై సంచలన వ్యాఖ్యలు చేశారు.' సినిమా అనేది రంగుల ప్రపంచం. ఒక్కసారి మేకప్ వేసుకుంటే అందులోనుండి బయటకు రావడం కష్టం. అలాంటి వారిలో శ్రీదేవి ఒకరు ఆమె ఎన్నో సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. కానీ, 55 సంవత్సరాల వయసులో అనారోగ్య కారణంగా మరణించింది. ఆమె డయాబెటిస్ హైబీపీ వంటి సమస్యలతో బాధపడేది. శ్రీదేవి అందం కోసం ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. దీనికి తోడు డైట్ ఆమె ఎక్కువగా తినేది కాదు. కానీ, మంచి డ్రింకర్ ప్రతిరోజు తాగేది' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మధు తోటపల్లి.
మధు తోటపల్లి అక్కడితో ఆగకుండా..' ఆమెకు డయాబెటిస్ చాలా ఎక్కువగా ఉండేది. తిండి తినాలంటే కూడా శ్రీదేవీ చాలా భయపడేది. మరోపక్క పిల్లల టెన్షన్ ఆమెకు ఎక్కువ. వారు తనలాగా ఉన్నత స్థాయికి చేరుకుంటారా? లేదా ? అనేది నిత్యం ఆలోచించేది. శ్రీదేవికి ఇద్దరు పిల్లలకు విపరీతమైన ఖర్చు ఉండేది. వారికోసం బోనికపూర్ రోజుకి లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఆమె తన కెరీర్లో తెలుగు, హిందీ , తమిళ్ సినిమాలలో దాదాపు మూడు షిఫ్టులలో తీవ్రంగా కష్టపడి పని చేసేది. కానీ 50 ప్లస్ వచ్చాక ఆమెకు సినిమాలలో అవకాశం రాకుండా పోయింది. దీంతో టెన్షన్ పెరిగిపోయింది. ఈ క్రమంలోనే మందు అలవాటు చేసుకుంది. ' సంచలన వ్యాఖ్యలు చేశాడు.

తోటపల్లి మధు ఇంకా మాట్లాడుతూ.. 'శ్రీదేవి చనిపోయిన రోజు కూడా రాత్రి 11 గంటలకు డ్రింక్ చేసింది. ఆ సమయంలో పిల్లలు గానీ, తన భర్త బోనీ కపూర్ కూడా తన దగ్గర లేరు. ఆమె ఏ మందులు వేసుకోవాలో.. ఎప్పుడు ఇంజక్షన్ తీసుకోవాలో.. అనేది బోనికపూర్ ఫోన్ చేసి గుర్తు చేసి ఉండేవారు. అయితే.. ఆరోజు ఫోన్ కు ఛార్జింగ్ పెట్టకుండా డ్రింక్ చేస్తూనే ఉంది. దీంతో షుగర్ లెవెల్స్ పడిపోయాయి. ఆయన ఆమె డ్రింక్ చేస్తూనే ఉంది. సడన్ గా బోనీకపూర్ కూడా అక్కడికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంకా తాగింది. ఆ తర్వాత బాత్రూం కి వెళ్ళగానే పడిపోయి కోమాలోకి వెళ్లిపోయింది. సావిత్రి కోమాలోకి వెళ్లిన 14 నెలల తర్వాత చనిపోయింది. కానీ శ్రీదేవి మాత్రం 14 నిమిషాలకే చనిపోయింది. రిచ్ శ్రీదేవి.. పూర్ సావిత్రి వలె డ్రింక్ వల్లనే ప్రాణాలు పోగొట్టుకున్నారు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు
తోటపల్లి మధు కామెంట్స్ ను శ్రీదేవి అభిమానులు తీవ్రంగా ఖండిస్తున్నారు. చనిపోయిన వారిపై అనవసరంగా ఇష్టం ఉన్నట్లు మాట్లాడవద్దు అంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఏది ఏమైనా సినీ వినీల ఆకాశంలో శ్రీదేవి ఎన్నటికీ ఆమె ధ్రువతారనే.


Click it and Unblock the Notifications











