సల్మాన్ ఖాన్ నోట్ల కట్టలు విసరబోతున్నాడని తెలిసి ఒకే చోట వేలాది మంది జనాలు..ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సహాయం చేయడంలో ముందుంటాడని అందరికి తెలిసిందే. ఈ లాక్ డౌన్ లో అందరి హీరోలతో పాటు సల్మాన్ కూడా తన వంతు సహాయాన్ని ప్రకటించాడు. అయితే ఇటీవల మహారాష్ట్రలో కొంత మంది జనాలు సల్మాన్ ఖాన్ సహాయం చేయబోతున్నట్లు తెలిసి ఒక ప్రదేశానికి వెళ్లారు. అక్కడ వేలాది మంది జనాలు ఒకే చోట చేరడంతో పోలీసుల వచ్చి అందరికి షాకిచ్చేలా ఆన్సర్ ఇచ్చారు.

సల్మాన్ సహాయం..
తన ఫామ్ హౌజ్ నుంచి తన దగ్గర పని చేసే కుటుంబాలకు అలాగే కొంత మంది పేద కళాకారులకు సల్మాన్ ఖాన్ సహాయం అందిస్తూ వస్తున్నాడు. అలాగే ముంబైలో ఉన్న కొంత మంది జనాలకు కూడా ఈ కండల వీరుడు బియ్యాన్ని అలాగే అవసరమైన వంట సామగ్రిని కుఫా పంపిణీ చేశాడు.

సోషల్ మీడియాలో వైరల్..
సల్మాన్ చేస్తున్న సహాయల గురించి సోషల్ మీడియాలో అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ఏది నిజమో ఏది అబద్ధమే తెలియని పరిస్థితి వచ్చే వరకు ప్రచారాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ వర్గం నెటీజన్స్ వార్తల డోస్ కూడా పెంచడంతో వాట్సాప్ గ్రూపులలో కూడా వైరల్ అయ్యాయి.

నోట్ల కట్టలతో వస్తున్నాడని..
సల్మాన్ ఖాన్ పేద ప్రజలకు సహాయం అందించడానికి పర్యటన మొదలుపెట్టడాని, పలనా చోటుకు వస్తే నోట్ల కొట్టలు ఇస్తాడని రీసెంట్ గా మహారాష్ట్ర భివండి జనాలకు ఒక వార్త అందింది. సోషల్ మీడియాకు ఆ న్యూస్ వైరల్ కావడంతో నిజమనుకొని వేలాది మంది జనాలు ఖండూ పడ ఏరియాలోకి ఎంట్రీ ఇచ్చారు.
Recommended Video

ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఇలాంటి రూమర్ అక్కడి వారిని ఆందోళన కలిగించింది. వెంటనే పోలీసులు అక్కడి జనాలకు అదంతా అబద్దమని చెప్పి షాక్ ఇచ్చారు. కొందరు అక్కడి నుంచి కదలకపోవడంతో పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. ఇక ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











