పవన్ సభకు కిరాయి గుండాలు, పోలీసుల పక్కావ్యూహం!
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ రోజు సాయంత్రం విశాఖపట్నంలోని ఇందిరాప్రియదర్శిని స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు దాదాపు 6 లక్షల మంది అభిమానులు హాజరు కాబోతున్నారు. అయితే సభ నిర్వాహకులకు కొందరు అగంతకుల నుండి బెదింపు కాల్స్ వచ్చాయి. సభలో అలజడి సృష్టిస్తామని వారు హెచ్చరించినట్లు సమాచారం.
దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సభకు భారీ భద్రత కల్పించారు. రాజకీయంగా ఎదుగుతున్న పవన్ కళ్యాణ్‌ను అడ్డుకునేందుకు ఆయనంటే పడని వారు, ప్రత్యర్థులు కిరాయి గుండాలను రంగంలోకి దించినట్లు అభిమానులు చర్చించుకుంటున్నారు. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సాయంత్రం ఏం జరుగబోతోందో? అనే ఆందోళన సర్వత్రా నెలకొంది.

సభలోకి ఎంటరయ్యే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పోలీసులు వారిని సభా ప్రాంగణం లోనికి అనుమతిస్తారు. తనిఖీల కోసం ఇప్పటికే ప్రత్యేక బృందాలు స్టేడియంకు చేరుకున్నాయి. క్రికెట్ మ్యాచ్ సమయంలో ఎలాంటి భద్రత ఉంటుందో....ఈ సభకు కూడా అలాంటి భద్రత ఏర్పాటు చేసారు. సభా ప్రాంగణంలో కూడా ఏం జరుగుతుందనే విషయాలను పోలీసులు కెమెరాల ద్వారా వీక్షిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితిని అంచనా వేయనున్నారు.
బెదిరింపు కాల్స్ నిజమై ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఎలా స్పందించాలనే విషయమై కూడా పోలసులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ చుట్టూ ప్రైవేటు సిబ్బందితో పాటు పోలీసులు వలయంగా ఉండబోతున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఇప్పటికే అభిమానులు విశాఖ చేరుకున్నారు.
"యూత్ ఆఫ్ ది నేషన్..ఫైట్ ఫర్ ది నేషన్''అనే నినాదంతో నిర్వహించే ఈ బహిరంగ సభలో రాసిన 'ఇజమ్' పుస్తకాన్ని విడుదల చేస్తారు. ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే ఈ సభలో పురుషులు, మహిళల కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసారు.


Click it and Unblock the Notifications











