ఆ ఎఫెక్ట్ రామ్ చరణ్ చిత్రం పై పడుతుందా?

అయితే కథ లేకుండానే కథనంతోనే రాజమౌళి గతంలో ఎన్నో హిట్స్ ఇచ్చాడనీ కొందరు వాదిస్తున్నారు. అందులోనూ అతని ప్రతీ సినిమానూ కమర్షియల్ గా నిలబెట్టేందుకు ఏదో ఒక ట్రిక్ ప్లే చేస్తాడనీ ఈ సారీ అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందని మరికొంతమందంటున్నారు. అయినా ఇవాళ ఈ రెండు సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి గానీ లాస్ట్ దీపావళి కి పునర్జన్మ కాన్సెప్ట్ తో వచ్చిన ఓం శాంతి ఓం సూపర్ హిట్ కాదా అని రెట్టిస్తున్నారు.
ఏమో లాస్ట్ ఇయర్ కీ ఇప్పటికీ ప్రేక్షకులలో మార్పు వచ్చిందేమో అందుకే ఫ్లాఫ్ అయ్యాయోమో అని మరొకరు అంటే అంత త్వరగా మారేవారు కాదులే మనవాళ్ళు అని ఓ ఫిల్మ్ నగర్ వాసి వారి సందేహాన్ని తీర్చాడు. అయినా రాజమౌళి,రామ్ చరణ్ సినిమా కాంబినేషన్ అంటే మినిమం గ్యారెంటీ అని అందరికీ నమ్మకం కాబట్టి ఓపినింగ్స్ కి లోటుండదు. కొంచెం బాగున్నా వరస కలెక్షన్స్ కీ ఇబ్బంది ఉండదు..కాబట్టి ఈ ఎఫెక్ట్ పడే అవకాశం ఉండే అవకాశం ఉండదు....ఏమంటారు.


Click it and Unblock the Notifications











