'ఎ ఫిల్మ్ బై అరవింద్' సినిమాతో పాపులర్ అయిన దర్శకుడు శేఖర్ సూరి తాజా చిత్రం 'త్రి' . రాజీవ్ కనకాల, రిషి, శాంతి చంద్ర , ఊర్వశీ శర్మ హీరో,హీరోయిన్లుగా ఫణి రాజ్. పి, జి.ఎస్.బాబులు ఈ సైకలాజికల్ థ్రిల్లర్ ని నిర్మిస్తున్నారు. దర్సకుడు శేకర్ సూరి మాట్లాడుతూ మా చిత్రంలో హత్యలుండవు వాటిని చేసిన వారిపై అన్వేషణలు సాగవు. ఒక్క మాటలో చెప్పాలంటే మనసులో నిగుడంగా ఉండే ఎన్నో ఉద్వేగాలు, అవి ఆదే ఆటలు మాచిత్రంలో అంతర్లీనంగా ఉంటాయి. కథ కొత్తగా ఉంటుంది అని అన్నారు. ప్రస్తుతం చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని రీ రికార్డింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రవళి, రంగనాద్, హర్ష వర్ధన్, బెనర్జీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం విజయ్ కూరాకుల అందిస్తున్నారు. మిగిలిన కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకుని జూలైలో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు చెప్పారు.