నాగేశ్వరరావు,నాగార్జున,నాగచైతన్య ఒకే చిత్రంలో.. డిటేల్స్
అక్కినేని మూడు తరాల హీరోలు ఒకే చిత్రంలో చూసే అవకాశం త్వరలోనే రానుంది. ఈ మేరకు క్రియేటివ్ డైరక్టర్ గా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ స్క్రిప్టు రెడీ చేస్తున్నారు.చందమామ చిత్రం తీసిన సి.కళ్యాణ్ ఈ చిత్రం నిర్మిచనునన్నారు. చంద్రలేఖ తర్వాత నాగార్జున,కృష్ణవంశీ దర్శకత్వంలో చిత్రం రాలేదు. ఆ రకంగానూ ఈ ప్రాజెక్టు క్రేజీగా మారనుంది. ఇక ఈ స్టోరీ లైన్ ఈ మూడు తరాల హీరోలు విని ఓకే చేసారని సమాచారం. నాగచైతన్య కూడా ఈ ప్రాజెక్టుపై మంచి ఆసక్తిని కనపరుస్తున్నారు. తమ తర్వాత తరాల వారు కూడా ఈ చిత్రం తమ ఆస్ధిగా భావిస్తారని నాగార్జున..నాగేశ్వరరావుని ఒప్పించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నాగార్జున ..వీరూ పోట్ల దర్శకత్వంలోనూ,శ్రీనివాస రెడ్డి డైరక్షన్ లోనూ, విజయేంద్ర ప్రసాద్ ,గౌతం మీనన్ లతోనూ చిత్రాలు చేయటానికి కమిట్ అయ్యారు.
నాగార్జున నాగచైతన్య అక్కినేని నాగేశ్వర రావు కృష్ణ వంశీ వీరూ పోట్ల శ్రీనివాస రెడ్డి గౌతం మీనన్ విజయేంద్ర ప్రసాద్ nagarjuna nagachaitanya nageswara rao ninne pelladatha gowtham menon vijeya


Click it and Unblock the Notifications