నాగార్జున ఎక్స్ పెరిమెంటల్ మూవీ ‘రాజన్న’లో ముగ్గురు హీరోలు...!?
అక్కినేని నాగార్జున టైటిల్ పాత్రలో తెరకెక్కుతున్న తదుపరి చిత్రం 'రాజన్న' త్వరలో విడుదలకి సిద్ధం అవుతోంది. ఈ చిత్రం చాలా సంతృప్తికరం గా వచ్చిందని చిత్ర నిర్మాణ సభ్యులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా, ఈ చిత్రానికి ముగ్గురు హీరోలు అని కూడా చెబుతున్నారు. వారు ఎవరు అనుకుంటున్నారా? 'నాగార్జున, బేబీ ఎన్నీ మరియు కీరవాణి సంగీతం'. బేబీ ఎన్నీ ఈ చిత్రంలో ప్రధాన పాత్ర అయితే మొదట్లో ఈ విషయాన్ని అక్కినేని అభిమానులు ఖండించారు.
కానీ సినిమా విడుదలకి సిద్దమవుతోన్న ఈ దశలో ఇందులో నాగార్జున పాత్ర ఇంటర్వెల్ లోనే ఎంటర్ అవుతుందనేది ఇదివరెకె తెలిసిన విషయమే. ఆదిలాబాద్ జిల్లలో జరిగే ఈ కథ, రజాకర్ల దౌర్జన్యాలకు ఎదురు తిరిగే ఒక వ్యక్తి కథ గా చెప్పుకోవచ్చు. సెకండాఫ్ లోనూ రాజన్న పాత్ర పూర్తిగా ఉండదని, మధ్యలో కాసేపు మళ్లీ ఏనీ అనే పాపమీదే కథ నడుస్తుందని, రాజన్న పాత్ర వర్చువల్ గా ఉన్నా కానీ ఫిజికల్ గా తెరపై కనిపించేది మాత్రం గంట కంటే తక్కవ సమయమేనని తెలిసింది. పతాక సన్నవిన్నివేశాల్లోనూ రాజన్న స్ఫూర్తి ఉంటుంది. నాగ్ ఇంతటి ప్రయోగాన్ని ప్రేక్షకులు ఏమేర స్వాగతిస్తారనేది చూడాల్సిందే..
కీరవాణి సంగీతం ఇప్పటికే మంచి ఆదరణ పొందుతోంది. ఈ చిత్రం తెలుగు సినిమా పరిశ్రమ కు ఒక మైలు రాయి గా మిగిలిపోతుందని నిర్మాతలు భావిస్తున్నారు. రాజన్న చిత్రాన్ని ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం లో రూపొందించారు. నాగార్జున స్వయం గా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. డిసెంబర్ 23 న ఈ చిత్రం విడుదల కు సిద్ధం అవుతోంది.


Click it and Unblock the Notifications











