twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫారెన్ భామతో రాంచరణ్, ఎన్టీఆర్.. 45 రోజులు ఇంటర్వెల్ ఎపిసోడ్!

    |

    యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ రాజమౌళి దర్శత్వంలో భారీ మల్టీస్టారర్ చిత్రంలో నటించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. సౌత్ లో రూపొందుతున్న అతిపెద్ద మల్టీస్టారర్ చిత్రం ఇది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ చిత్రం ప్రకటించి చాలా కాలం అవుతున్నా ఇంతవరకు ప్రారంభం కాలేదు. ఎట్టకేలకు ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది.

    ముహూర్తం అప్పుడే

    ముహూర్తం అప్పుడే

    ముందు నుంచి ఈ చిత్రం నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ ప్రారంభం అవుతుందని వార్తలు ప్రచారం అయ్యాయి. తాజగా ఈ చిత్రానికి ముహూర్తం కుదిరినట్లు తెలుస్తోంది. నవంబర్ 5న పూజా కార్యక్రమాలతో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారట. ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావడంతో రాజమౌళి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

    ఎన్టీఆర్ ‘బాక్సాఫీస్' దూకుడు.. చరిత్ర సృష్టించిన అరవింద.. ఖైదీ నం 150 రికార్డు బ్రేక్! ఎన్టీఆర్ ‘బాక్సాఫీస్' దూకుడు.. చరిత్ర సృష్టించిన అరవింద.. ఖైదీ నం 150 రికార్డు బ్రేక్!

    Recommended Video

    Ram Charan And Jr NTR Characters In SS Rajamouli's #RRR Movie
    ఫారెన్ భామతో

    ఫారెన్ భామతో

    తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో ముగ్గురు హీరోయిన్లకు ఆస్కారం ఉన్నట్లు తెలుస్తోంది. అందులో ఒక హీరోయిన్ గా ఫారెన్ బ్యూటీని ఎంచుకోబోతున్నట్లు తెలుస్తోంది. చిత్రం ప్రారంభమయ్యాక కాస్టింగ్ గురించి పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఎప్పటిలాగే రాజమౌళి చిత్రానికి కీరవాణి సంగీతం అందించనున్నారు. బాహుబలి చిత్రానికి పనిచేసిన సినిమాటోగ్రాఫర్ సెంథిల్ ఈ చిత్రానికి కూడా కెమెరా భాద్యతలు నిర్వహిస్తారు.

    ఇద్దరూ విభిన్నంగా

    ఇద్దరూ విభిన్నంగా

    ఈ చిత్రంలో రాంచరణ్, ఎన్టీఆర్ లుక్ విభిన్నంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి ఎన్టీఆర్ లుక్ పై దృష్టి పెట్టాడు. త్వరలోనే చరణ్ లుక్ కి సంబంధించి కూడా రాజమౌళి ఓ నిర్ణయానికి వస్తారు. వీరికోసం ప్రత్యేకమైన వర్క్ షాప్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది.

    45 రోజుల పాటు ఇంటర్వెల్

    45 రోజుల పాటు ఇంటర్వెల్

    ఈ చిత్రంలోని ఇంటర్వెల్ సన్నివేశాన్నే 45 రోజుల లాంగ్ షెడ్యూల్ లో పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. కళ్ళు చెదిరేలా యాక్షన్ ఎపిసోడ్స్ రూపొందించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బాహుబలి తరువాత రాజమౌళి సినిమాపై అంచనాలు విపరీతంగా పెరగడం ఖాయం. ఆ అంచనాలని అందుకునే విధంగా రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Three heroines in Ram Charan, NTR multistarrer. Rajamouli planning for 45 days massive schedule for interval block
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X