ఆ ముగ్గురు భామల మధ్య పోరు!
త్రిష, కాజల్, ఇలియానా తెలుగు సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్లు. గత సంవత్సరం వరకు నువ్వానేనా అన్నట్లు పోటీ పడిన ఈ భామలు ఈ సంవత్సరం కూడా అదే స్థాయిలో పోరుకు సిద్ధం అయ్యారు. ఈ సంవత్సరం ఆరంభంలోనే ఈ ముగ్గురు హిట్లతో ఖాతా తెరిచారు. కాజల్ నటించి బిజినెస్ మేన్ సక్సెస్ సాధించి భారీ వసూళ్ల దిశగా సాగుతుంటే, బాడీగార్డ్ సూపర్ హిట్ తో త్రిష కూడా జోష్ మీద ఉంది. తమిళ సినిమా 'నంబన్' హిట్‌తో గోవా సుందరి ఇలియానా కూడా తానేమీ తక్కువ కాదని నిరూపించుకుంది. నంబన్ సినిమా తెలుగులో 'స్నేహితుడు' పేరుతో అనువాదమై ఈ నెలలోనే సినిమాను విడుదల చేస్తున్నారు.
బిజినెస్ మేన్ తర్వాత కాజల్ మురుగదాస్ దర్శకత్వంలో 'తుపాకి' అనే చిత్రంలో నటిస్తోంది. దీని తర్వాత శ్రీను వైట్ల-జూ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందే సినిమాలో నటించబోతోంది. నంబన్ సినిమా తర్వాత ఇలియానా తెలుగులో అల్లు అర్జున్ సరసన 'హనీ' చిత్రంతో పాటు బాలీవుడ్‌లో బర్ఫీ, కిలాడి 786, వన్స్ అపానే టైమ్ ముంబై2 చిత్రాల్లో నటిస్తోంది. బాడీగార్డ్ సినిమా తర్వాత త్రిష్ జూ ఎన్టీఆర్ తో దమ్ము, తమిళంలో సమరన్ అనే చిత్రంలో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











