త్రిభాషా నిషా త్రిషతో నిర్మాతలు ఫుల్ హ్యాపీ!
కమల్ సరసన చిత్రంలో నటించే అవకాశం రాగానే ఎగిరి గంతేసిన త్రిష తర్వాత ఆ చిత్రం ఆగిపోయిందని అందులో తనకు బదులు వేరే హరోయిన్ ను తీసుకున్నారనీ వార్తలు రావడంతో ఒక్కసారిగా డీలా పడిపోయిన విషయం తెలిసిందే అయితే ఆమెను మంచి మూడ్ లోనికి తీసుకురాబడానికి బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ పడరాని కష్టాలు పడ్డాడట. 2010 లో టాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా ఒప్పుకోకుండా బాలీవుడ్ పై మమకారం పెంచుకున్న త్రిషకు అక్షయ్ దొరకాల్సిన రీతిలో దొరకడంతో అక్కడే తన నివాసాన్ని ఏర్సాటు చేసుకోవాలని అనుకుంటుందట.
త్రిష ప్రస్తుతం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో త్రిష చక్రం తిప్పుతోందనే చెప్పాలి. విశేషం ఎమిటంటే త్రిష నటించిన చిత్రాలు అయితే హిట్స్ లేదా సక్సె స్‌లూ సాధిస్తూ నిర్మాతని హాపీగా వుంచుతున్నాయి. మహేష్, వెంకటేష్, ప్రభాస్, రవితేజ ఎవరి సరసన నటించినా మెప్పించింది. తమిళంలో సూర్య, విక్రమ్, విజయ్, అజిత్‌లతో పోటీపడుతోంది. హిందీలో అక్షయ్ తో సరేసరి. తమిళ తంబి శింబుతో 'లిప్‌లాక్ అక్షయ్ కెమిస్ట్రీ అదిరిపోయిందంటున్నారు. మొత్తా నికి మూడు భాషల్లో రాణిస్తూ త్రిబాషా నిషా త్రిషా అనిపిం చుకుంటోంది.


Click it and Unblock the Notifications











