థియేటర్ లో ముగ్గురైనా మిగులుతారా?(త్రీ రివ్యూ)

ఒంటరిగా ఉన్న నిషా(ఊర్వశి శర్మ) కి పగలు,రాత్రి తేడాలేకుండా ఏవేవో విచిత్రమైన శబ్దాలు,చంపుతానంటూ శంకర్ అనే వ్యక్తి బెదిరింపులు వినిపిస్తూంటాయి. మేటర్ అర్ధం కాని మేడం ప్రక్కింటి శ్రీరామ్(రిషి) అనే ఫొటో జర్నలిస్ట్ తో కలసి సైక్రాటిస్ట్(హర్షవర్ధన్)ని కలుస్తుంది. అతను టెస్ట్ చేసి ఆమె స్క్రిజో ఫేనియా అనే మానసిక వ్యాధితో బాధ పడుతోందని డిసైడ్ చేస్తాడు. అయితే ఆమె ఆ వినపడే వాయిస్ తనకు ఐలాండ్ లో పరిచయమైన శంకర్(శాంతి చంద్ర) వాయిస్ లా అనిపిస్తోందని చెప్పటంతో అక్కడికి బయిలుదేరతారు. అయితే అక్కడికి వెళ్లాక అతను కాదని తెలుస్తుంది. అయితే ఇంకెవరు అనుకుంటున్న సమయంలో రాజీవ్ (రాజీవ్ కనకాల)అనే విచిత్ర వ్యక్తి పరిచయమవుతాడు. అతను వారి సాయం కోరుతాడు. కానీ అతనే ఆమెను బెదిరిస్తున్న వ్యక్తి అని ఆమె రూడీ చేసుకుంటుంది. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది. నిషా కి,రాజీవ్ కి సంభంధం ఏమిటి,శంకర్ ఈ కథలోకి ఎట్లా వచ్చాడన్నది మిగతా కథ.
ఎ ఫిల్మ్ బై అరవింద్ సినిమా చూసిన వాళ్ళు ఏదో మళ్ళీ మంచి థ్రిల్లర్ చూడబోతున్నామని వెళితే నిరాశ మిగిల్చే సినిమా ఇది. నిజానికి శేఖర్ సూరి పారా నార్మల్ థ్రిల్లర్ గా ఈ సినిమాని తీద్దామని ప్లాన్ చేసాడు. అతని గత సినిమా తరహాలోనే సస్పెన్స్ నేరేషన్ వర్కవుట్ చేయటానికి ప్రయత్నించాడు. కానీ ఎక్కడా అతను అనుకున్న సీన్లలో సస్పెన్స్ ఎలివేట్ కాకపోవటం, ప్రేక్షకుల్ని భయపెట్టకపోవటం జరిగింది. ముఖ్యంగా కథనంలోనే భయపెట్టే లక్షణాలు లేకపోవటం మైనస్ గా నిలిచింది.అయినా కథ రెగ్యులర్ మసాలా సినిమా లా ఉండటం జరిగింది. దాంతో చెప్పే పద్దతి ద్వారా భయపెడదామనుకున్నా నవ్వులపాలయింది. ఇలాంటి కథలు తెలుగు ప్రేక్షకులుకు కొత్త కాదు. అసలు ఇలాంటి సినిమాలు థియోటర్ లో కూర్చున్నంతసేపైనా నిజమే సుమా ఇలా జరగవచ్చు అని నమ్మించకల్గితేనే వర్కవుట్ అవుతుంది.
ఇక నటుల్లో బాలీవుడ్ సెక్స్ బాంబ్ ఊర్వరీ శర్మ ఎక్స్ పోజింగ్ ఫరవాలేదనిపిస్తుంది. రిషి,రాజీవ్ కూడా తమతమ పాత్రల్లో ఇమిడిపోయారు.హర్షవర్దన్ ఉన్నంతలో నవ్వించే ప్రయత్నం చేసారు. ఇంతమంది ఇంత ఎనర్జీ పెట్టినా కథ,కథనాలే దెబ్బతీసాయి.
ఏదైమైనా ఇలాంటి సినిమాలకి స్క్రిప్టే ప్రాణం. అదే ఇక్కడ ఫెయిలైంది. మొహమాటం లేకుండా ఎవాయిడ్ చెయ్యాల్సిన సినిమా ఇది. లేకపోతే సినిమా చూసాక ఆ కాన్సెప్ట్ లో లాగ పునర్జన్మ ఎత్తాలనిపించటం ఖాయం.


Click it and Unblock the Notifications











