పూరీ 'నేనూ...నా రాక్షసి' సంగీతం విషయంలో స్పెషల్ అదే
పూరీ జగన్నాధ్ ,రానా కాంబినేషన్ లో రూపొందుతోన్న నేనూ నా రాక్షసి చిత్రానికి ముగ్గరు మ్యూజిక్ డైరక్టర్స్ పనిచేస్తున్నారు. ఇలా ఒకే చిత్రానికి ముగ్గరు పనిచేయటం అనేది తెలుగులో మొదటిసారి. ఇక ఈ మ్యూజిక్ డైరక్టర్స్ ఎవరంటే...విశాల్-శేఖర్, విశ్వ, పప్పీ లహరి(బప్పీ లహరి కుమారుడు). వీరు ముగ్గరూ..రెండు పాటలు చొప్పున కూరుస్తూ..ఆరు పాటలు పూర్తి చేస్తారు. అలాగే వీరంతా బాలీవుడ్ కి చెందిన వారే కావటం మరో విశేషం. సుబ్బరాజు, అలీ, ప్రదీప్ రావత్, ముమైత్ ఖాన్ ప్రధాన పాత్రల్లో రూపొందే పూరీ చిత్రంలో హీరోయిన్ గా ఇలియానా చేస్తోంది. నల్లమలుపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రాణా ఓ డిఫెరెంట్ క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. అది ప్రొపెషనల్ కిల్లర్ గా చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఓ లవ్ స్టోరి గా వెళుతూ ఓ డిఫెరెంట్ ట్విస్ట్ తో నిండి ఉంటుందని చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో రాణా తన కండలు ప్రదర్శించనున్నారు. ఓ డీసెంట్ లవ్ స్టోరీగా..ఓ కొత్త ఫీల్ తో చిత్రం ఉంటుందని, లీడర్ తర్వాత చేస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని దర్శక,నిర్మాతలు ధీమాగా ఉన్నారు. ఈ చిత్రం ఫిల్మ్ నాయర్ జెనర్ లో ఉండబోతోందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











