రామ్ చరణ్ కుటుంబంలోకి మరో ముగ్గురు కొత్తగా..(వీడియో)
హైదరాబాద్: రామ్ చరణ్ కుటుంబంలోకి మరో ముగ్గురు కొత్తగా వచ్చారు. ఈ విషయం విని మీరు రామ్ చరణ్-ఉపాసనలకు సమబంధించి ఏదైనా విశేషం ఉందనుకుంటే పొరపాటే. రామ్ చరణ్ కుటుంబంలోకి కొత్తగా వచ్చింది మనుషులు కాదు. మూడు కుక్కలు. కుక్కలు అంటే ఎంతో ఇష్టపడే రామ్ చరణ్-ఉపాసన దంపతులు ఇప్పటికే ఓ కుక్కను పెంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో మూడు కుక్కలను కూడా తీసుకొచ్చారు. ఇవి తమ కుటుంబంలోకి మరింత సంతోషాన్ని తెచ్చాయని రామ్ చరణ్ తన ఫేస్ బుక్ పేజీలో పేర్కొన్నారు. వాటికి సంబంధించిన ఓ వీడియోను కూడా పోస్టు చేసాడు.

Post by Ram Charan.

రామ్ చరణ్ తాజా సినిమా 'గోవిందుడు అందరి వాడేలే' సినిమా విషయానికొస్తే...
రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం 'గోవిందుడు అందరివాడేలే' . కాజల్ హీరోయిన్. శ్రీకాంత్, కమలిని ముఖర్జీ ప్రధాన పాత్రధారులు. కృష్ణవంశీ దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్ నిర్మాత. దర్శకుడు కృష్ణ వంశీ పుట్టిన రోజు సందర్భంగా జూలై 28న టీజర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని సమాచారం.

అక్టోబర్ 1న సినిమా విడుదలవుతోంది. కెరీర్లో తొలి దసరా రిలీజ్. సూపర్ ఎగ్జైటెండ్' అంటూ రామ్ చరణ్ సంతోషంగా ఉన్నారు. ఈ చిత్రంలో చరణ్ పల్లెటూరికి వచ్చే ఎన్నారై పాత్రలో నటిస్తున్నారు.రామ్ చరణ్ తేజ్, కాజల్ కాంబినేషన్లో ఇది మూడో సినిమా. ఇంతకు ముందు 'మగధీర', 'నాయక్' చిత్రాల్లో కలిసి నటించారు.
ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుధ, శ్రీకాంత్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో ప్రకాష్ రాజ్, జయసుద, శ్రీకాంత్ నటిస్తున్నారు. తొలుత రాజ్ కిరణ్‌ను ఎంపిక చేసినప్పటికీ...తర్వాత అతని స్థానంలో ప్రకాష్ రాజ్‌ను తీసుకుని ఆయనకు సంబంధించిన సీన్లు రీ షూట్ చేసారు. ఇప్పటి వరకు మాస్, యాక్షన్ సినిమాలతో అలరించిన రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రంలో ఫ్యామిలీ హీరోగా కనిపించనున్నాడు.

Click it and Unblock the Notifications