మోహన్ బాబు ఇంటిపై దాడి.. ముగ్గురిని అరెస్టు చేసిన పోలీసులు.. వారి వెనకున్నదేవరు?
శనివారం రాత్రి మోహన్ బాబు ఇంట్లోకి కొందరు దుండగులు కారుతో దూసుకెళ్లి నానా హంగామా చేశారు. సినీ పరిశ్రమలో అందరిని ఒక్కసారిగా షాక్ కి గురి చేసిన ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది. అనేక రకాల అనుమానాలకు దారి తీయడంతో పోలీసులు వెంటనే స్పందించి ఉదయమే కారు నెంబర్ సహాయంతో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

గేటును డీ కొట్టి..హల్ చల్
హైదరాబాద్ లోని శంషాబాద్ సమీపాన ఉన్న జల్ పల్లిలో మొహన్ బాబుకి చెందిన ఒక ఫామ్ హౌజ్ ఉంది. అయితే శనివారం సాయత్రం ఒక ఇన్నోవా కారు మూసి ఉన్న గేటును డీ కొట్టి మరి లోపలికి దూసుకు వచ్చింది. కొన్ని నిమిషాల వరకు మోహన్ బాబు కుటుంబ సబ్యులకు ఏం జరుగుతుందో అసలు ఏమి అర్థం కాలేదు. మొత్తం నలుగురు వ్యక్తులు కారులో ఉన్నట్లు తెలుస్తోంది.

సీసీ టీవీ ఆధారంగా
సీసీ టీవీ ఆధారంగా దృశ్యాలను చూసిన పోలీసులు కారు నెంబర్ AP 13 AN 0004గా గుర్తించారు. ఇక వారు బెదిరింపులకు పాల్పడడం మంతా ఆందోళనను కలిగించింది. మిమ్మల్ని అస్సలు వదలం అంటూ హెచ్చరించి వెళ్లినట్లు మోహన్ బాబు కుటుంబ సభ్యులు తెలియజేశారు.
Recommended Video

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
వెంటనే ఘటనపై పోలిసులకు పిర్యాదు చేయగా కొన్ని గంటలలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. కారు నెంబర్ సాయంతో ఆరా తీయగా విజయలక్ష్మి ఆమె మహిళ పేరు మీద ఆ కారు రిజిస్టర్ చేయబోతున్నట్లు పోలీసులు కనుగొన్నారు. ఇక నలుగురిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.


Click it and Unblock the Notifications











