మహేష్ 26 లోనూ అదే రిపీట్.. మరోసారి సక్సెస్ కలిసొచ్చేనా..?
ఇటీవలే భరత్ అనే నేను, మహర్షి రూపంలో రెండు వరుస బ్లాక్‌బస్టర్స్ సాధించిన మహేష్ బాబు ఇక తన తదుపరి చిత్రంపై ఫోకస్ చేయబోతున్నారు. సూపర్ స్టార్‌గా తెలుగు తెరపై వెలిగిపోతున్న ఈ రాజకుమారుడు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఫారెన్ టూర్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడి నుంచి తిరిగి రాగానే తన 26 వ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనున్నారు మహేష్. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు చర్చకు వస్తున్నాయి.

మహేష్ జోడీగా కన్నడ భామ
మహేష్ బాబు జోడిగా యంగ్ హీరోయిన్, కన్నడ భామ రష్మిక మందన్న ఈ సినిమాలో కన్ఫర్మ్ అయిందని అంటున్నారు. మహేష్ నటించిన గత చిత్రాలకు భిన్నంగా రాయలసీమ బ్యాక్‌డ్రాప్ లో ఈ చిత్ర కథాంశాన్ని మరింత ఆసక్తికర అంశాలతో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.

విజయశాంతి ఎంట్రీతో క్రేజ్
గతంలో దక్షిణాది సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతూ అందరు స్టార్ హీరోల సరసన నటించిన లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి మహేష్ 26తో రీ ఎంట్రీ ఇవ్వనుండటం ఈ సినిమా పట్ల మరింత క్రేజ్ పెంచేసింది. చాలా ఏళ్ల తర్వాత వండితెరపై విజయశాంతి పర్‌ఫార్‌మెన్స్ చూసేందుకు కుతూహలంగా ఉంది ప్రేక్షక లోకం.

మహేష్ 25 లాగే.. దీనికి కూడా
ఇక మహేష్ 25 వ సినిమా మహర్షికి ముగ్గురు నిర్మాతలు కావడం బాగా కలిసొచ్చిందనే సెంటిమెంట్ తో తన 26 వ సినిమాకు కూడా ముగ్గురు నిర్మాతలు ఉండాలని డిసైడ్ అయ్యారట మహేష్. ఈ మేరకు నిర్మాతలు దిల్‌రాజు, అనిల్ సుంకరలతో పాటు ఈ చిత్ర నిర్మాణంలో మహేష్‌బాబు కూడా భాగం అవుతుండటం విశేషం.

సరిలేరు నీకెవ్వరు..
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న మహేష్ బాబు 26 వ సినిమా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. మహేష్ బాబు లేకుండానే మే 31న ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనుంది చిత్రయూనిట్. చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ బాణీలు కట్టనున్నారు. ఇక ఈ చిత్రానికి 'సరిలేరు నీకెవ్వరు' అనే టైటిల్ దాదాపుగా ఫిక్స్ అయినట్లేనని ఫిలింనగర్ టాక్. 2020 జనవరిలో ఈ సినిమా విడుదల చేసేందుకు ప్రిపేర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











