నాగ్ 'కింగ్' చిత్రంలో త్రిష కాక మరో ఇద్దరు హీరోయిన్స్ చేస్తున్నారు. వాళ్ళు మమతా మోహన్ దాస్,మధు షాలిని అని తెలుస్తోంది. ఫక్తు ఎంటర్ టైనర్ గా నడిచే ఈ చిత్రంలో నాగార్జున కథానుసారంగా ముగ్గురు గా కనిపిస్తాడు. అయితే త్రిపాత్రాభినయం కాదట. ఒక్కడే కొన్ని సిట్యువేషన్స్ లో ముగ్గురుగా చేయాల్సివస్తుందిట. ఇక బ్రహ్మానందం సంగీత దర్శకుడుగా నవ్విస్తాడుట. అయితే ఈ సారి ఎవరు మీద సెటైర్ వేయనున్నాడనేది ప్రశ్న. త్రిష సింగర్ గా విభిన్నమైన పాత్ర చేస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని డి.శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తుంది. ఇక శ్రీను వైట్ల మరో సారి ఈ కామిడీతో భాక్సాఫీసుని డిసెంబర్ 19న ఢీ కొట్టబోతున్నాడానికి ప్లాన్ చేస్తున్నారు.