ఒకే సినిమాలో కరీనా కపూర్, నయనతార, అసిన్..!
ఒకే దర్శకుడు మూడు భాషల్లో ఒకే కథతో రూపొందిస్తున్న చిత్రాల్లో ముగ్గురు ఫేమస్ హీరోయిన్లు నటిస్తుండడం విశేషం. మలయాళంలో 'బాడీగార్డ్" పేరుతో సిద్దిఖ్ రూపొందించిన చిత్రంలో దిలీప్ హీరో కాగా, హీరోయిన్ గా నయనతార చేసింది. అదే చిత్రాన్ని 'కావలన్" పేరుతో తమిళ్ తో విజయ్ తో నిర్మితస్తున్నారు. అందులో హీరోయిన్ అసిన్. హిందీలో 'బాడీగార్డ్" పేరుతోనే రూపొందుతున్న ఈ చిత్రంలో కరీనా కపూర్ హీరోయిన్ గా చేస్తోంది. తమిళ్ లో విజయ్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేశానని, హిందీలో చాలా మార్సులు చేశానని దర్శకుడు సిద్దిఖ్ చెప్తున్నాడు. ఈ మధ్య విడుదలై ఘనవిజయం సాధించిన 'దబాంగ్" నిదృష్టిలో పెట్టుకొని ఎక్కువ మార్పులు చేసినట్టు తెలుస్తోంది. ముగ్గురు ఫేమస్ హీరోలు, ముగ్గురు ఫేమస్ హీరోయిన్లతో ఒకే డైరెక్టర్ అదే సినిమాని చెయ్యడం విశేషమనే చెప్పాలి.
కరీనా కపూర్ నయనతార అసిన్ బాడీగార్డ్ దిలీప్ విజయ్ సల్మాన్ ఖాన్ kareena kapoor nayantara asin bodyguard dilip vijay salman khan


Click it and Unblock the Notifications