సమరానికి సై అంటున్న టాలీవుడ్ ని శాసించే స్టార్లు...!
ముగ్గురూ ముగ్గురే ఆ ముగ్గురు ఈ సారి రేసులో నిలబడుతున్నారు. విజయం ఎవరిని వరిస్తుంతో తెలియాలంటే మనం ఇంక నెల రోజులు ఆగాల్సిందే. ఒకటి ఆడియో రిలీజై విడుదలకు సిద్దంగా వుంది. మిగిలినవి ఆడియో రిలీజ్ అవ్వడానికి రెడీగా వున్నాయి. ఇప్పటికే ఆ ముగ్గురు ఎవరో మీకు అర్దం అయ్యే వుంటుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ అందగాడు ప్రిన్న్ మహేష్, యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్.
ఓ మెగా ఫ్యాన్న్ మరోవైపు మహేష్ ఫ్యాన్న్ ఇంకోకవైపు నందమూరి ఫ్యాన్న్ సెప్టెంబర్ రెండవ వారంలో తమ సత్తా చాటడానికి రెడీగా ఉన్నారు. వాళ్శ తో పాటు ప్రేక్షకులు, సంగీత అభిమానులు కూడా సంబరాలు చేసుకోవడానికి రెడీగా వున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం 'కొమరం పులి'ని సెప్టెంబర్ రెండవ వారంలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
సూపర్ స్టార్ ప్రిన్న్ మహేష్ తాజా చిత్రం 'ఖలేజా' సెప్టెంబర్ 10వ తేదీన ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ కమింగ్ మూవీ 'బృందావనం' ఆడియో ఆవిష్కరణ సెప్టెంబర్ 12న వైభవంగా జరుగనుంది. అలాగే సినిమాని అక్టోబర్ 1వ తారీఖున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
దీనిని బట్టి టాలీవుడ్ ని శాసించగల ఈ ముగ్గురు పోరుకు సయ్యంటున్నారు. సెప్టెంబర్ లో అబిమానులందరూ వినాయకచవతి సంబరాల్లో మునిగితేలుతుండగా వీళ్శు మాత్రం మేము కూడా సంబరాల్లో మునిగితేలడానికి సిద్దంగా వున్నామని అంటున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు మునుగుతారో ఎవరు తేలుతారో చూడాలంటే సినిమాలు వచ్చేవరకు ఆగాల్సిందే.


Click it and Unblock the Notifications











