మూడు సినిమాల అర్ధ శతదినోత్సవాలు
ఈ సీజన్‌లో మంచి హిట్ అయిన వెంకటేష్- నయనతారల లక్ష్మి సినిమా 215 సెంటర్లలో అర్ధ శత దినోత్సవాన్ని పూర్తి చేసుకోనుంది. ఈనెల 12న ఏలూరులో అర్ధ శతదినోత్సవం జరుపనున్నారు. సక్సెస్ రేటింగ్‌లో ఆ తర్వాత స్ధానంలో ఉన్న లారెన్స్- ప్రభుదేవాల స్టైల్ అర్ధ శత దినోత్సవం ఈనెల 8న జరగనుంది. ఈ సినిమా 108 సెంటర్లలో యాభై రోజులు ఆడింది. వైవిఎస్ చౌదరి దేవదాసు 75 కేంద్రాల్లో యాభై రోజులు పూర్తి చేసుకుంది. దాదాపు ఒకేసారి విడుదలైన మూడు సినిమాలు అర్ధ శతదినోత్సవాలు జరుపుకోవడం విశేషమే.


Click it and Unblock the Notifications