కోడి రామకృష్ణ తొలి సినిమా: చిరంజీవి కోసం పట్టుబట్టి, అవమానిస్తే వర్కౌట్ అవుతుందని..

శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకృష్ణ శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. రామకృష్ణ మరణంతో తెలుగు సినిమా పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణ వార్త విని షాకైన పలువురు సినీ ప్రముఖులు ఆయనకు సంతాపం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు.

చిరంజీవి హీరోగా వచ్చిన 'ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య' సినిమాతో కోడి రామకృష్ణ దర్శకుడిగా కెరీర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన తన తొలి సినిమా జ్ఞాపకాలను పంచుకున్నారు.

చిరంజీవి కావాలని పట్టుబట్టి

చిరంజీవి కావాలని పట్టుబట్టి

నా తన తొలి సినిమా కథ నిర్మాత రాఘవకు చెప్పగానే హీరో ఎవరు? అని అడిగారు. నేను చిరంజీవి అని చెప్పాను. ఆయన దానికి ఒప్పుకోలేదు. మా సంస్థకు కొందరు హీరోలు ఉన్నారు.. వారిని కాకుండా నువ్వు చిరంజీవి అని ఎలా డిసైడ్ అవుతావు? అని ప్రశ్నించారు. నా కథకు చిరంజీవి మాత్రమే సరిపోతాడని పట్టుబట్టి వారిని కన్విన్స్ చేసి ఒప్పించినట్లు కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

చిరంజీవిని అవమానిస్తేనే వర్కౌట్ అవుతుందని ఒప్పించి

చిరంజీవిని అవమానిస్తేనే వర్కౌట్ అవుతుందని ఒప్పించి

నేను చిరంజీవే కావాలని పట్టుబడట్టడంతో పెద్దలందరినీ పిలిచి మీటింగ్ పెట్టారు. ఎందుకు అయనే కావాలని పట్టుబడుతున్నావని అంతా నన్ను ముద్దాయిలా నిల్చొబెట్టి ప్రశ్నించారు. ‘నా సినిమా కాన్సెప్టు భార్య.. భర్తను అనుమానించడం, అవమానించడం. అది మీరు చెప్పిన హీరో కంటే చిరంజీవిని అవమానిస్తే మహిళా ప్రేక్షకులు థ్రిల్ అవుతారు అని చెప్పి నిర్మాత రాఘవను కన్విన్స్ చేసినట్లు కోడి రామకృష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.

అలా తొలి ప్రాజెక్ట్ ఓకే అయింది

అలా తొలి ప్రాజెక్ట్ ఓకే అయింది

నిర్మాత ఓకే చెప్పగానే చిరంజీవిని వెళ్లి కలిశాను. ఆయన్ను కలవడం అదే తొలిసారి. అపుడు రెమ్యూనరేషన్ గురించి చిరంజీవి పట్టించుకోలేదు కానీ కథ నచ్చితేనే చేస్తాననే కండీషన్ పెట్టారు. కథ విన్న తర్వాత తన క్యారెక్టర్ చాల్లేదు అన్నారు. కానీ పూర్ణిమ, సంగీత క్యారెక్టర్, విలన్ క్యారెక్టర్ నచ్చింది, మహిళా ప్రేక్షకులు లైక్ చేస్తారు, సినిమా ఆడుతుందనే నమ్మకం ఉంది కాబట్టి చిరంజీవి చేస్తానన్నారు.... అంటూ తన తొలి సినిమా జ్ఞాపకాలను కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్నారు.

చిరంజీవి-కోడి రామకృష్ణ సినిమాలు

చిరంజీవి-కోడి రామకృష్ణ సినిమాలు

చిరంజీవితో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత ఆలయశిఖరం, సింహపురిసింహం, గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలను కోడి రామకృష్ణ తెరకెక్కించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X