Don't Miss!
- Sports సూపర్ సండే: సునామీ సన్‌రైజర్స్‌ను ఢీకొట్టేదెవరు: నెక్స్ట్ మ్యాచ్ డీటెయిల్స్ ఇవే
- News గంటాకు సీటు ఖరారు - టీడీపీ తుది జాబితా విడుదల, లిస్టులో..!!
- Automobiles కొత్త స్కూటర్ కొనేవారికి గుడ్ న్యూస్.. ఏథర్ రిజ్టా ప్రీ బుకింగ్‌లు ప్రారంభం.. రూ. 999 చెల్లిస్తే చాలు
- Travel గుడ్‌ప్రైడే రోజున లాంగ్‌వీకెండ్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ ప్లేస్‌లు చూసేయండి...
- Finance ICICI: ఐసీఐసీఐ బ్యాంక్ డివిడెండ్ ప్రకటిస్తుందా..!
- Lifestyle అమ్మాయిలూ! హెయిర్ స్ట్రెటనింగ్, కలరింగ్ అంటూ హెయిర్ స్టైల్ కు పోతే ..కిడ్నీలు పోతాయి..జాగ్రత్త సుమీ..!
- Technology వాట్సాప్ కాలింగ్ ఫీచర్ వినియోగిస్తున్నారా.. అయితే ఈ అప్డేట్ మీకోసమే..!!
కృష్ణగారికి నా మనసులో మాట అలా చెప్పా.. ఆయన ఏమన్నారంటే.. విజయ నిర్మల (పాత ఇంటర్వ్యూ)
ప్రముఖ నటి, దర్శకురాలు, సూపర్‌స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల బుధవారం అర్ధరాత్రి అనారోగ్యంతో కన్నుమూశాను. గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె వయసు 73 సంవత్సరాలు.
విజయ నిర్మల నట ప్రస్థానం 7 ఏళ్ల వయసులోనే మొదలైంది. నటిగా సక్సెస్ అవ్వడంతో పాటు దర్శకురాలిగా అత్యధిక చిత్రాలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నెలకొల్పారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో విజయ నిర్మల తన కరీర్ ఎలా మొదలైంది? గిన్నిస్ బుక్ వరకు ఎలా చేరుకోగలిగారు అనే విషయాలు వెల్లడించారు.
7 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం
నా సినిమా రంగ ప్రవేశం 7 సంవత్సరాల వయసు ఉన్నపుడు బాలనటిగా జరిగింది. మా కజిన్ బాల సరస్వతి గారు పెద్ద సింగర్. నేనంటే ఆవిడకు చాలా ఇష్టం. నాకు డాన్స్ నేర్పించారు. ఓ రోజు సినిమాలో యాక్ట్ చేస్తావా? అని అడిగితే చేస్తాను అని చెబితే షూటింగుకు తీసుకెళ్లారు. పి.పుల్లగారి డైరెక్షన్లో శాంతి కుమార్, యశ్వలక్ష్మి హీరో హీరోయిన్లుగా తీస్తున్న తమిళ సినిమాలో నేను హీరో చిన్ననాటి పాత్ర చేశాను.
హీరోయిన్గా తొలి అవకాశం
తర్వాత సింగారి అనే సినిమా చేశాను. చిన్నపుడు బాలనటిగా ఆరేడు సినిమాలు చేశాను. పాండురంగ మహత్యం, భూ కైలాస్ ఈ రెండు నాకు కాస్త ఊహ వచ్చిన తర్వాత చేసిన సినిమాలు. చదువు, డాన్స్ నేర్చుకుంటుండటంతో ఆర్టిస్టుగా గ్యాప్ వచ్చింది. ఆ రోజుల్లో నాన్నగారు వాహిని స్టూడియోలో సౌండ్ ఇంజనీర్ గా పని చేసేవారు. నాన్నగారి ఫ్రెండ్ కెమెరా మెన్ విన్సెంట్ నన్ను చూసి సినిమాలో హీరోయిన్గా కావాలని అడిగారు. ఈ విషయం నాన్నగారు నన్ను అడగటంతో చేస్తానని చెప్పాను. అలా నాకు మొదటగా హీరోయిన్ ఛాన్స్ మలయాళంలో వచ్చింది.‘భార్గవి నిలయం' అనే చిత్రంలో భార్గవి కుట్టి అనే టైటిల్ రోల్ చేశాను. ప్రేమ్ నజీర్ హీరో.
రంగులరాట్నం ద్వారా తెలుగులో, నంది అవార్డ్
తెలుగులో బిఎన్ రెడ్డిగారు తీసిన ‘రంగుల రాట్నం' సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చాను. అందులో వీణ వాయించే సాంగ్ ఉంది. వీణ వాయించే సీన్ కోసం నాకు 15 రోజులు శిక్షణ ఇప్పించారు. అది నాకు నంది అవార్డు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ద్వారా అంజలి దేవి గారితో చేసే అదృష్టం దక్కింది.
అందరు హీరోలతో చేశా... కృష్ణ గారితో అదే తొలిసారి
నా సినిమాలు చూసిన నాగిరెడ్డిగారు తెలుగులో తీసిన ‘షావుకారు జానకి' తమిళంలో రీమేక్ చేస్తే అందులో నాకు టైటిల్ రోల్ ఇచ్చారు. ఇది నాకు తొలి తమిళ సినిమా. ఈ సినిమా ద్వారా నేను విజయవారి సంస్థతో పనిచేసే అవకాశం వచ్చింది. హీరోయిన్గా అప్పటికీ మూడు సినిమాలు అయ్యాయి. ఆ తర్వాత కృష్ణగారు, నేను కలిసి ‘సాక్షి' సినిమాలో తొలిసారి కలిసి నటించాం. సాక్షి తర్వాత మలయాళంలో 10 నుంచి 12 సినిమాలు చేశాను. అప్పట్లో అందరు హీరోలతో చేశాను. మొదట్లోనే పెద్ద బేనర్లో చేసే అవకాశం రావడంతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ మొదలైంది.
అందుకే పేరు మార్చారు
నా అసలు పేరు నిర్మల. అందరూ నిమ్మీ అని పిలిచేవారు. అయితే నాగిరెడ్డిగాను నాపేరును విజయ నిర్మలగా మార్చారు. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రీలో నిర్మలగారు ఉన్నారు. కన్ఫ్యూజన్ ఉండకూడదని అలా చేశారు. నాకు కూడా ఆ పేరు నచ్చింది, అదృష్టంగా భావిస్తాను. విజయంతో మొదలవుతుంది.
బాపుగారి స్పూర్తితో దర్శకత్వం వైపు
అప్పుడు టెక్నికల్‌గా ఏమీ తెలియదు. నేనొక ఆర్టిస్టును మాత్రమే. వెళతాను, డైలాగులు చెబుతాను, నటిస్తాను. కానీ ‘సాక్షి' చేసినపుడు బాపుగారు డైరెక్షన్. ఆయన షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రతిరోజూ సాయంత్రం స్కెచెస్ వేసుకునేవారు. ఇది లాంగ్ షాట్, ఇది మిడ్ షాట్, ఇది క్లోజప్ షాట్ అని బొమ్మలు వేసి దాని ప్రకారం షూటింగ్ చేసేవారు. నేను పక్కన ఉండి చూసేదాన్ని. నేను ఏం అడిగినా విసుగులేకుండా చెప్పేవారు. అప్పటి నుంచి డైరెక్షన్లోకి రావాలనే కోరిక మొదలైంది. సినిమాలు చేస్తున్నపుడు డైరెక్షన్ ఎలా చేస్తున్నారు, లెన్సులు ఎలా మారుస్తున్నారు చూసేదాన్ని. నేను డైరెక్టర్ అవ్వడానికి బాపుగారు స్పూర్తి.
కృష్ణగారికి నా మనసులో మాట అలా చెప్పా.. ఆయన ఏమన్నారంటే..
దర్శకత్వం చేయాలని ఉందని కృష్ణ గారికి చెబితే ఇప్పుడే హీరోయిన్గా వచ్చావు. ఒక 50 సినిమాలు అయిన తర్వాత డైరెక్టర్ అవ్వు అన్నారు. మలయళంలో హీరయిన్ గా అవకాశం వచ్చినట్లే... డైరెక్షన్ చేసే తొలి అవకాశం కూడా మలయాళంలోనే దక్కింది. తెలుగులో మొదట ‘కవిత' అనే సినిమా అనుకున్నాం. కానీ బడ్జెట్ వేస్తే రూ. 6 లక్షలు వచ్చింది. అది నాకు చాలా ఎక్కువ. మలయాళంలో చేస్తే రూ. 3 లక్షల్లో అయిపోయింది. తొలి చిత్రం విజయం సాధించింది. తర్వాత యద్దనపూడి సులోచనగారి ‘మీనా' అనే నవలను సినిమాగా తీశాను. ఆ సినిమా నాకు 100 రోజులు ఆడింది. దర్శకురాలిగా 44 సినిమాలు చేశాను. బయట ప్రొడ్యూసర్ల నుంచే చాలా అవకాశాలు వచ్చాయి. మా సొంత బేనర్లో 20 సినిమాలు చేశాం. అలా 44 సినిమాలు చేసి గిన్నిస్ బుక్ వరకు వచ్చాను.. అని విజయనిర్మల గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.