షారుక్ ఖాన్ నే కాదు పొమ్మన్న నయన్.. పాత ముచ్చటను నెమరవేసుకుంటోన్న నెటిజన్లు

కొన్ని ముచ్చట్లు గురించి ఎన్ని సార్లు చెప్పుకున్నా తనివి తీరదు. అలాంటివి సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా పేరుగాంచిన నయనతార జీవితంలో అనేకం ఉన్నాయి. సాధారణ నటిగా కెరీర్ మొదలుపెట్టి సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్న నయన్, ఇప్పుడు పట్టిందల్లా బంగారమే అవుతోంది. ఆమె డేట్లు దొరకడమే మహా భాగ్యంగా భావిస్తున్నారు దర్శక నిర్మాతలు. అయితే, నయన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇప్పటికిప్పుడు పుట్టుకువచ్చిందేమీ కాదు.

తన కెరీర్ కు ఏది మంచిదో ఏది కాదో చక్కగా అంచనా వేసుకోగల నేర్పరి కాబట్టే అమ్మడు ఈ రేంజ్ లో ఇరగదీస్తోంది. ఇందుకోసం బడా హీరోల ప్రాజెక్ట్ లు వదులుకోవాల్సి వచ్చినా అమ్మడు వెనక్కు తగ్గదు. ఈ క్రమంలో ఓ సారి నయన్ బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను సైతం రిజెక్ట్ చేసిందట.

Throwback - when Nayan Refused to shake legs with KIng KHan

గతంలోకి ఓసారి తొంగి చూస్తే, చెన్నై ఎక్స్ ప్రెస్ షూటింగ్ సమయంలో స్పెషల్ సాంగ్ లో కనువిందు చేసేందుకు నయనతారను అడిగారట. షారుఖ్ ఖాన్ హీరో కాబట్టి, మామూలుగానే ఏ హీరోయిన్ అయినా ఎగిరిగంతేసి మరీ ఓకే అనేసేది. కానీ, నయన్ మాత్రం సున్నితంగా నో చెప్పేసింది.

అప్పటికే టాప్ హీరోయిన్ అయిన తనకు ఇలాంటి పాటలు ఏమాత్రం ఉపకరించవని నిర్ణయించుకుంది. అందుకే బాద్షానే కాదనేసింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి 100కోట్ల రూపాయిలు వసూలు చేసింది. కానీ, స్పెషల్ సాంగ్ లో చిందేసిన ప్రియమణికి మాత్రం ఆ పాట ఏమాత్రం ఉపయోగపడలేదు. మరి దీన్ని బట్టే నయన్ ముందు చూపు ఎటువంటిదో అర్ధమవుతోంది కదా...!

ప్రస్తుతం "కాథు వాకుళ రెండు కాదల్" అనే చిత్రంలో నటిస్తున్న నయనతార, విజయ్ సేతుపతి, సమంత అక్కినేనితో కలసి స్క్రీన్ షేర్ చేసుకోబోతోంది. నయన్ బాయ్ ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా, ఇప్పటికే సినిమా ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. మరి.. నయన్, సమంత అందాలు ఈ సినిమాకు ఎంత వరకూ ఉపకరిస్తాయో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X