విజయ్‘తుపాకి’విడుదల తేదీ మార్పు
హైదరాబాద్ : గజనీ, స్టాలిన్, సెవెన్త్ సెన్స్ చిత్రాల దర్శకుడు ఏఆర్ మురుగదాస్ తాజా చిత్రం 'తుపాకి'. విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన ఈ చిత్రం నవంబర్ 9న దీపావళికి విడుదల చేయాలని ప్లాన్ చేసారు. అయితే ఈ చిత్రం విడుదల తేదీ మారింది. నవంబర్ 13న చిత్రాన్ని విడుదల చేయాల నిర్ణయించారు. . విభిన్నమైన నేపథ్యంలో మురుగదాస్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా అనువాద హక్కులను ఎస్వీఆర్ మీడియా శోభారాణి సొంతం చేసుకున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి నవంబర్‌లో ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శోభారాణి మాట్లాడుతూ -''గ్రేట్ కాంబినేషన్‌తో రూపొందుతోన్న సినిమా ఇది. తెలుగులో దర్శకుడు మురుగదాస్‌కు, విజయ్, కాజల్‌లకు ఉన్న క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకొని ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నాం. ఊహలకు అతీతంగా ఈ సినిమా ఉంటుంది. మురుగదాస్ 'గజనీ' ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో... అంతకు మించి సంచలనాన్ని ఈ సినిమా సృష్టిస్తుంది'' అని తెలిపారు.
.విజయ్, కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని 75 కోట్ల భారీ వ్యయంతో జెమినీ ఫిల్మ్ సర్క్యూట్స్ సంస్థ నిర్మిస్తోంది. తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్వీర్ మీడియా సంస్థ విడుదల చేస్తోంది. మురగదాస్ తన పంథాకు భిన్నంగా ఫుల్ లెన్త్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్‌గా దీన్ని రూపొందిస్తున్నారు. హేరిష్ జైరాజ్ సంగీతం అందిస్తున్న ఈచిత్రానికి సంతోష్ శివన్ ఫోటోగ్రఫీ అందిస్తున్నారు.
ఓ చిన్న గ్రామం నుంచి ముంబయ్ వెళ్లి అక్కడ డాన్ అవతారమెత్తిన ఓ యువకుడి కథ ఈ సినిమా. గత నాలుగు నెలల నుంచీ ఈ చిత్రం టైటిల్ పై వివాదం కొనసాగింది. రీసెంట్ గా ఈ టైటిల్ వివాదం రాజీకొచ్చి విడుదలకు సిద్దమవుతోంది. ఈ భారీ చిత్రాన్ని విజయ్ తండ్రి ఎస్ఎ చ్రందశేఖర్ నిర్మిస్తుండటం విశేషం. మురుగదాస్‌కున్న క్రేజ్, కాజల్‌కు ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రాన్ని తెలుగులోనూ భారీగా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: హేరిస్ జైరాజ్, కెమెరా: సంతోష్ శివన్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్.


Click it and Unblock the Notifications











