ఎట్టకేలకు 'తుపాకి' విడుదల తేదీ ఖరారు
హైదరాబాద్ : యాక్షన్ థ్రిల్లర్ 'తుపాకి' విడుదల తేదీ వాయిదా పడుతోందంటూ వార్తలు వచ్చాయి. వాయినాని పడింది. అయితే ఎట్టకేలకు ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రాని దీపావళి కానుకగా ఈ నెల 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత శోభారాణి. జెమిని ఫిల్మ్ సర్క్యూట్ తమిళంలో నిర్మిస్తున్న చిత్రం 'తుపాకి'. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. హారిస్ జైరాజ్ స్వరకర్త. ఈ చిత్రాన్ని ఎస్వీఆర్ మీడియా ప్రై.లిమిటెడ్ పతాకంపై శోభారాణి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ -''తుపాకీలాంటి భారీ చిత్రం అనువాద హక్కులను సొంతం చేసుకున్నందుకు ఆనందంగా ఉంది. ఈ చిత్రం హక్కుల కోసం 15 కోట్లు వెచ్చించాం. ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురి చేసే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందింది. దర్శకుడు మురుగగదాస్ ఎంతటి ప్రతిభావంతుడో అందరికీ తెలిసిందే. ఆయనే ఈ చిత్రానికి వెన్నెముక. ఇక, విజయ్ నటన, ఆయన చేసిన రిస్కీ ఫైట్స్ ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి. బాక్సర్‌గా కాజల్ పాత్ర ఓ ఎస్సెట్. హారీస్‌జైరాజ్ అందించిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సంతోష్‌శివన్ కెమెరా పనితనం తప్పకుండా కనువిందు అవుతుంది'' అని చెప్పారు.
అలాగే "సెన్సార్ పూర్తయింది. క్లీన్ యు సర్టిఫికెట్ వచ్చింది. క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కింది 'తుపాకి'. దీపావళి కానుకగా 13న విడుదల చేస్తున్నాం. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వచ్చింది. హారిస్ మ్యూజిక్‌కు మంచి మార్కులు పడుతున్నాయి. ఓ ఆర్మీ వ్యక్తి సెలవులకోసం తన ఊరికి వస్తాడు. అక్కడ అతను ఎదుర్కొన్న పరిణామాలే ఈ సినిమా కథ. స్క్రీన్‌ప్లే ప్రధానంగా సాగుతుంది. తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది.కాజల్, విజయ్ పెర్‌ఫార్మెన్స్ సూపర్బ్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, హ్యారీస్ మ్యూజిక్, సంతోష్‌శివన్ కెమెరా పనితనం సినిమాకు హైలైట్ అవుతాయి'' అని అన్నారు. ఈ చిత్రానికి మాటలు: శ్రీరామకృష్ణ, పాటలు: వనమాలి, కందికొండ, కూర్పు: శ్రీకర్ ప్రసాద్, కెమెరా: సంతోష్ శివన్, నిర్మాత: సి.శోభ.


Click it and Unblock the Notifications











