Pushpa 2 : టికెట్లు మేమే కొనాలి, సావులు మేమే సావాలే.. అల్లుఅర్జున్ పై సెటైర్స్

Pushpa 2 : అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన మాస్టర్ పీస్ పుష్ప 2. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు ముందు వచ్చి.. ఎన్నో రికార్డులను క్రియేట్ చేసింది. అయితే ఈ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. అయితే.. ఈ ఘటనపై భారీ ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అందులో భాగంగానే ప్రస్తుతం ఓ సెటైరికల్ సాంగ్ నెటింట్లో వైరల్ అవుతుంది. ఆ వివరాలేంటో?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. నేషనల్ క్రష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా పుష్ప 2. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన ఈ సినిమాకు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహించారు. ఇందులో సునీల్, పాజిద్ పజిల్, అనసూయ ప్రధాన పాత్రల్లో నటించి మెప్పించారు. డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా 12 వేల థియేటర్ల లో గ్రాండ్ గా విడుదలైంది. అతి తక్కువ వ్యవధిలోనే పలు పాన్ ఇండియా సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.

Ticketlu Meme Konali setirical Folk Song On Allu Arjun Pushpa 2 the stampede incident

ప్రస్తుతం రూ. 1700 కోట్లకు పైగా వసూలు చేసి.. బాక్సాఫీసు వద్ద పుష్ప గాడు తన రూలింగ్ ను కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇంతటి భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా యూనిట్ సంబరాలను చేసుకోలేక పోతుంది. ఈ మూవీ ప్రీమియర్ షో సమయంలో డిసెంబర్ 4న హైదరాబాదులోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో రేవతి అని మహిళా అభిమానురాలు ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీ తేజ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ ఘటనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

ఈ ఘటనకు బాధితులుగా సంధ్యా థియేటర్ ఓనర్ యజమాన్యం, అల్లు అర్జున్, అతని మేనేజర్ పై కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అనంతరం మధ్యంతర బెయిల్ తో బయటికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే బాధ్యత కుటుంబానికి తాము అండగా ఉంటామని ,అల్లు అర్జున్ తోపాటు సినిమా డైరెక్టర్ సుకుమార్, మూవీ మేకర్స్ రెండు కోట్ల ఆర్థిక సహాయం చేశారు. అలాగే పలువురు సినీ ప్రముఖులు వారికి అండగా నిలుస్తూ ఆర్థికంగా భరోసానిస్తూ.. మన ధైర్యాన్ని నింపుతున్నారు.

సంధ్యా థియేటర్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ఇకపై నుండి బెనిఫిట్ షోస్, టికెట్ల రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పింది. ఈ ఘటనతో తెలుగు సినిమా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు అయినా ఫలితం లేదని చెప్పాలి ఇకపైనుండి రాష్ట్రంలో బెనిఫిట్స్ గాని టికెట్లు పెంపునకు అనుమతి ఇవ్వబోమంటూ తేల్చి చెప్పేశారు. మరోవైపు టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలపై అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తూ పలువురు క్రిటిక్స్ సినీ ప్రముఖులు ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా అల్లు అర్జున్ వ్యవహార శైలి సరిగా లేదంటూ పోలీస్ శాఖ కూడా పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ ఘటనపై ఓ సెటైరికల్ ఫోక్ సాంగ్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఈ పాటలు టికెట్లు మేమే కొనాలే.. సప్పట్లు మేమే కొట్టాలే.. సావులు మేమే సావాలే.. సంపాదన మీరే కావాలి అంటూ సాగుతుంది. ఈ పాటను సింగర్ ప్రబాపు ఆలపించగా రవళి ఇందులో నటించారు. ఈ పాటకు లిరిక్స్, స్టోరీ, కాన్సెప్ట్ చిలుకల శ్రీనివాస్ యాదవ్ అందించారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, దర్శకత్వం బాధ్యతలను నరేష్ వేల్పుల నిర్వహించారు. ఈ పాట మసాలా బ్యాండ్ అనే యూట్యూబ్ ఛానల్ లో విడుదలైంది. ఇప్పటివరకు 10 k వ్యూస్ రాగా 2 కే లైక్స్ వచ్చాయి. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది.

More from Filmibeat

Read more about: folk song pushpa 2 allu arjun
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X