నిర్మాతగాజయంత్ మూడు భారీ చిత్రాలు
మహేష్‌బాబు-నమ్రతా శిరోడ్కర్‌ల పెళ్ళిని దగ్గరుండిజరిపించిన దర్శకుడు జయంత్ పరాన్జీఇప్పుడు నిర్మాతగా బిజీగా ఉన్నారు.నిర్మాతగా మూడు ప్రాజెక్టులు ఆయన ముందున్నాయి.
మహేష్‌బాబుహీరోగా స్యీయ దర్శకత్వంలో ఆయనఒక భారీ సినిమా నిర్మించనున్నారు. నటిరేవతి దర్శకురాలిగాతెలుగు-తమిళ భాషల్లో ఒకవెరైటీ ప్రేమకథా చిత్రం జయంత్‌రెండో ప్రాజెక్టు. ఇక మూడో సినిమానుప్రభుదేవా దర్శకత్వంలో నిర్మించనున్నారు. మహేష్‌బాబుతోతీయనున్న సినిమాలో హీరో పాత్ర నేటియువతకు అద్దం పడుతుందని, నవ్వుతూ తుళ్ళుతూ ఉంటూనేకోపమొస్తే కొడెనాగులా మారేక్యారెక్టర్ అని జయంత్ చెబుతున్నారు.
నటిరేవతి తనకో ప్రేమకథ చెప్పారని, ఆకథ అద్భుతంగా ఉండడంతో దర్శకత్వబాధ్యతను ఆమెకేఅప్పగించానని ఆయన చెప్పారు. ప్రభుదేవాదర్శకత్వంలో వచ్చిననువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాచూసి ప్రభు ట్యాలెంట్ ఎక్కడుందోతెలుసుకున్న జయంత్ 13-14 పాటలు ఉండేఒక మ్యూజికల్ లవ్ స్టోరీని నిర్మించనున్నారు. ఈసినిమాకు సంబంధించిప్రభుదేవాకు ఆయన పూర్తి స్వేచ్ఛఇవ్వనున్నారు. జయంత్ గతంలోమహేష్‌బాబుతో టక్కరిదొంగ సినిమా నిర్మించారు. ఆయనదర్శకత్వంవహించిన ప్రేమించుకుందాం రా,బావగారూ బాగున్నారా, ప్రేమంటేఇదేరా లక్ష్మీ నరసింహ,శంకర్‌దాదా ఎంబిబిఎస్ సినిమాలకు దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications











