చిరంజీవి సిన్మాకొంచెం వాయిదా?
మేనెలలో ముగ్గురు పెద్ద హీరోల భారీ సినిమాలువిడుదల కావలసి ఉంది. అయితే అనుకున్నతేదీ (మే 22)న ఎన్టీఆర్ కొండవీటి సింహంవిడుదలవుతోంది. చిరంజీవి ద్విపాత్రాభినయసినిమా (తాత్కాలిక టైటిల్‌అందరివాడు) మే నెలాఖరులో విడుదల కావచ్చు. ఈసినిమాను మే మధ్యలో విడుదలచేద్దామనుకున్నా కొన్ని కారణాల వల్ల కొన్నిరోజులు వాయిదా వేశారు. చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్‌సినిమా బన్నిహిట్ అయినందువల్ల దాని లైఫ్‌నుమరింత పెంచడానికి చిరంజీవి సినిమానువాయిదా వేసినట్టు తెలుస్తోంది. అందుకే చిరంజీవి గీతా ఆర్ట్స్‌సినిమా టైటిల్‌నుఇంకా అధికారికంగా ప్రకటించలేదు.తాత్కాలికంగా అందరివాడుఅనుకున్నప్పటికీ దీనికి మార్పులు చేర్పులుజరగవచ్చు. బన్ని పెద్దహిట్ అయితే చిరంజీవి సినిమా విడుదలవాయిదా పడుతుందని వార్తలు వచ్చినసంగతి తెలిసిందే. ఇప్పటికే బాగాఆలస్యమైన మహేష్‌బాబు అతడు కూడా మేలో విడుదల కావలసి ఉండగామరో నెల ఆలస్యం కావచ్చు. ఈ సినిమాఆడియోను మాత్రం మే మధ్యలోవిడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications











