సురేందర్ దర్శకత్వంలో ప్రభాస్
అతనొక్కడే సినిమాతో తన సరుకును నిరూపించుకున్న సురేందర్ కొత్త చిత్రంలో ప్రభాస్ నటించనున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కెఎల్ రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సురేందర్ తొలి సినిమా అతనొక్కడే హిట్ కావడంతో ఆయనకు అనేక అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా కెఎల్ రాజుకే చేస్తానని సురేందర్ ప్రకటించినా అప్పటికి హీరో ఖరారు కాలేదు. సురేందర్ తయారు చేసుకున్న క థకు ప్రభాస్ సరిగ్గ సరిపోతాడని నిర్ణయించారు. ప్రభాస్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఛత్రపతి షూటింగ్‌లొ ఉన్నాడు. ఆ తర్వాత ఎంఎస్ రాజు పౌర్ణమిలో ఆయన నటించవలసి ఉంది. ఆ తర్వాత సురేందర్-కెఎల్ రాజు సినిమాలో ప్రభాస్ నటిస్తాడు. అంటే వచ్చే సంవత్సరమే.


Click it and Unblock the Notifications











