సర్వంరామదాసు మయం
హోంపేజి సినిమా టిడ్‌బిట్స్
నాగార్జునశ్రీ రామదాసు మీద తెలుగు సినిమాపరిశ్రమ కళ్ళు ఉన్నాయి. తెలుగువారిఆరాధ్య దైవమైన శ్రీ రాముడు,హనుమంతుడు, జానపదులకుసుపరిచితమైన రామదాసు ఈ సినిమాలోఉండడం వల్ల ఈ సినిమా మాస్, క్లాస్‌అందరినీ ఆకర్షిస్తుందని నిర్మాతఆశాభావంతో ఉన్నారు. సూపర్‌హిట్ అయినఅన్నమయ్య టీం ఈ సినిమాలో ఉండడం క్రేజ్‌కు మరో కారణం. తెలుగుసినిమా చరిత్రలోనే ఎక్కువ ఆడియో కేసెట్లుఅమ్ముడుపోయిన రికార్డుఅన్నమయ్యకు ఉంది. అదే కీరవాణి ఈసినిమాకు సంగీత దర్శకత్వంవహిస్తున్నారు. శ్రీ రామదాసులో నాగార్జున రామదాసు జీవితంలోనిఐదు దశల పాత్రలను పోషించనున్నారు.
ఈసినిమాపబ్లిసిటీ కూడా అంచెలంచలుగా ఆసక్తికరంగాసాగుతోంది. రాముడుపాత్రను ఎవరు పోషిస్తారని ఉత్కంఠనెలకొన్న తరుణంలో బాలకృష్ణ, విక్రంపేర్లు వినవచ్చాయి. చివరిగా సుమన్‌పేరు ఖరారయింది. కబీర్ దాస్‌గా అక్కినేనినాగేశ్వరరావు నటిస్తారనిప్రకటించి మరో సంచలనంసృష్టించారు. హీరోయిన్ గా జ్యోతికనుఅనుకున్నా చివరికి ఆ పాత్ర స్నేహకు దక్కింది. రావణాసురుడుగానాగబాబును తీసుకోవడం మరోసంచలనం.


Click it and Unblock the Notifications











