పవన్‌బాలుచివరి పాట మొదలు
నాగార్జునమాస్ సినిమా ఎటూ హిట్ అయింది. ఇప్పుడుపవన్ కళ్యాణ్ బాలు మీదే అందరి దృష్టిఉంది. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌వర్క్ దాదాపు పూర్తయింది. పవన్‌కళ్యాణ్ ప్రత్యేకంగా అభిమానం పెంచుకున్ననీలో జరిగే తంతు నే చూస్తూనే ఉన్నా పాటనుప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. జనవరిఆరున విడుదల కానున్న బాలు సినిమానువైజయంతి ఎంటర్‌టైన్‌మెంట్స్ అండ్ స్టూడియోస్‌ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై సి.అశ్వనీదత్‌నిర్మిస్తున్నారు.
సిరివెన్నెలసీతారామ శాస్త్రి రాసిన నీలో జరిగేతంతు పూర్తి పాట
పల్లవి: నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా- దీన్నేతొలిప్రేమఅంటారే మైనా
ఏదో జరిగిందంటూ నీతో చెప్పానా- చాల్లే ఇట్లాంటివిచాలానే విన్నా- అంటే అన్నానంటూ కోపాలేనా-నువ్వే చెప్పు నే తప్పన్నానా ..
పోన్లే నీకేంటంటా నాకేమైనా- నీతో సాయంనిన్నిమ్మన్నానా... వలపంటే నిప్పులాంటిది కలకాలందాచలేనిది- సలహా విని ఒప్పుకోవే ఇకనైనా...
సర్లే ఈ ప్రేమ సంగతి నాలాగే నీకు కొత్తది-
అయినా ముందు నీకె తెలిసేనా...
చరణం:ప్రతిరోజూ నడిరాతిరిలో చేస్తావా స్నానాలు
ఒళ్ళంతా చెమటలు పడితే తప్పువుగా చన్నీళ్ళు
వణికించే చలికాలంలో ఏమా ఆవిర్లు - ఉడికించేఆలోచనలు పుడుతున్నవి కాబోలు
ఇంతిదిగా వేడెక్కే ఊహలు రేపిందెవరు-నీలా నను వేధించే దుష్టులు ఎవరుంటారు
అదిగో ఆ ఉలుకు చెబుతుంది నువు దాచాలనుకున్నా- దీన్నే లవ్‌లో పడిపోడం అంటున్నా
చాల్లే ఇలాంటివి చాలానే విన్నా :: నీలో జరిగే::
చరణం:ఒంట్లో బాగుండడం లేదా ఈ మధ్యన నీకసలు-నాకే ఎంచక్కా ఉన్నా నీకెందుకు ఈ దిగులు -అంతా సరిగానే ఉంటే ఎరుపెక్కాయేం కళ్ళు-వెంటాడే కలలొస్తుంటే నిదురుండదుతెల్లార్లు- అయితే నువ్వెప్పుడూ కనలేదాఈ కలలు- ఆ కలలో ఏనాడూ నువు రాలేదిన్నాళ్ళు-అదిగో ఆ మాటే నీ నోటే చెప్పించాలనుకున్నా-దీన్నే లవ్‌లో పడిపోడం అంటున్నా- అవునాఏమో నే కాదనలేకున్నా-
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమఅంటారేమైనా
నీలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నే తొలిప్రేమఅంటారేమైనా
నాలో జరిగే తంతు చూస్తూనే ఉన్నా దీన్నేతొలిప్రేమ అంటారో ఏమో :: అంటే అన్నానంటూ::
| అవీ ఇవీ | తెరచాటు | ఆఫ్‌బీట్ | ఆడియో | ట్రేడ్‌టాక్ | టిడ్‌బిట్స్ | చెన్నై చాట్ | స్వీట్‌హార్ట్ |


Click it and Unblock the Notifications











