విదేశాలకుపవన్, బాలకృష్ణ
బాలకృష్ణ,పవన్ కళ్యాణ్‌లు బిజీ షెడ్యూళ్ళ నుంచిఆటవిడుపుగా కొంతకాలం విదేశాల్లో గడిపిరానున్నారు. కాల్పుల కేసు నుంచి విముక్తి పొందినబాలకృష్ణ త్వరలోఅమెరికా వెళ్ళనున్నారు. ఆయనతన షూటింగ్ కార్యక్రమాలన్నీ వాయిదావేసుకుంటున్నారు. కుటుంబ సమేతంగాఅమెరికాలో ఊపిరి పీల్చుకు రావాలన్నది ఆయనఆలోచన.
గతకొద్ది నెలలుగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్‌కూడావిదేశాల్లో విశ్రాంతి తీసుకోనున్నారు. బాలుఆశించినంతగా విజయవంతంకాకపోవడం, ఇటీవల అపెండిసైటిస్‌ఆపరేషన్ చేయించుకోవడం- ఇంకామరెన్నో చికాకుల కారణంగా పవన్ ఈ దేశానికిదూరంగా హాయిగా కొంతకాలం గడపాలనిఅనుకుంటున్నారు. పవన్ ఈ నెలలో బంగారంషూటింగ్‌లో పాల్గొనవలసి ఉంది. తనకు విశ్రాంతిఅవసరమని, వచ్చే నెల షూటింగ్‌లో పాల్గొంటానని నిర్మాత ఎఎం రత్నంకుపవన్ సర్ధిచెప్పుకున్నాడు. ఈ సినిమాలోపవన్ హీరోయిన్ కోసం ఇంకా అన్వేషణసాగుతోంది.


Click it and Unblock the Notifications











